108 వాహనాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఉదయభాను

By Arun Kumar PFirst Published Oct 9, 2019, 5:44 PM IST
Highlights

ప్రమాదంలో వున్నవారికి తక్షణ సాయం అందించేందుకు వినియోగిస్తున్న 108 వాహనాలను విప్ ఉదయ భాను పరిశీలించారు.  

108 వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను బుధవారం తనిఖీ చేశారు.  జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిలిపివుంచిన వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. 

వాహనం బయటి కండీషన్ నే కాదు లోపలికి ఎక్కిమరీ పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు 108 వాహనంలో అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయా..? లేవా...? అని పరిశీలించారు. వాటి ఉపయోగాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్, రికార్డు లను ఆయన  క్షుణ్ణంగా పరిశీలించారు. 


108  అనే నెంబర్ కు ప్రజలు ఫోన్ చేయగానే తక్షణమే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందేలా చూడాలని  ఉదయభాను సూచించారు. 


 

click me!