ఎనిమిదో తరగతి విద్యార్థితో బలవంతంగా టాయ్ లెట్ కడిగించి..

By telugu teamFirst Published Sep 18, 2019, 12:45 PM IST
Highlights

స్కూలుకి ఆలస్యంగా వస్తున్నారనే కారణం చూపించి కావాలనే తమను స్కూల్ టాయ్ లెట్స్, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారని మరో విద్యార్థి పేర్కొన్నాడు. చేతికి గ్లౌజులు కూడా లేకుండా టాయ్ లెట్స్ శుభ్రం చేయించడం చాలా నేరమని వారు పేర్కొంటున్నారు.

కేంద్రియ విశ్వవిద్యాలయంలో టీచర్లు దారుణంగా ప్రవర్తించారు. స్వచ్ఛభారత్ పేరుతో... ఎనిమిదో తరగతి విద్యార్థి చేత బలవంతంగా టాయ్ లెట్ కడిగించారు.  హైదరాబాద్ నగరంలోని శివరామపల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కనీసం ఆ విద్యార్థికి చేతులకు గ్లౌజులు, మూతికి కట్టుకోవడానికి మాస్కులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ ఘటనపై ఓ విద్యార్థి మీడియాకు వివరించాడు. ‘‘ స్వచ్ఛ భారత్ లో పాల్గొనడానికి తమకు ఎలాంటి సమస్య లేదని కాకపోతే... అది నిజంగా స్వచ్ఛభారత్ కోసమే తమతో ఈ పని చేయించారా ? స్వచ్ఛభారత్ చేయాలంటే... కనీసం మా ఆరోగ్యం పట్ల కొంచెమైనా శ్రద్ధ చూపించాలి కదా? మా ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టి మరీ మీము టాయ్ లెట్స్ శుభ్రం చేయాలా’’ అంటూ ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

స్కూలుకి ఆలస్యంగా వస్తున్నారనే కారణం చూపించి కావాలనే తమను స్కూల్ టాయ్ లెట్స్, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారని మరో విద్యార్థి పేర్కొన్నాడు. చేతికి గ్లౌజులు కూడా లేకుండా టాయ్ లెట్స్ శుభ్రం చేయించడం చాలా నేరమని వారు పేర్కొంటున్నారు.

ఆ విద్యార్థులు టాయ్ లెట్స్ క్లీన్ చేస్తున్న సమయంలో మరికొందరు విద్యార్థులు ఫోటోలు తీసి... వాటిని బాలల హక్కుల చట్టానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బాలల హక్కుల కోసం పోరాడే యాక్టివిస్ట్ అచ్యుతరావు మాట్లాడారు. దీనిపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు స్కూల్ కి వెళ్లేది టాయ్ లెట్స్ కడగటానికి కాదని... చదువుకోవడానికి, ఆడుకోవడానికి అని చెప్పారు. పిల్లలకు స్వచ్ఛభారత్ గురించి నేర్పించడం అవసరమేనని... కాకపోతే అలాంటి పనులు చేయించకూడదన్నారు. హైజనిక్ కాని పనులు పిల్లలతో చేయించకూడదన్నారు. 

click me!