ముగిసిన గణేష్ నిమజ్జనం.. చెరువులను శుభ్రం చేసే పనిలో జీహెచ్ఎంసీ

By telugu teamFirst Published Sep 14, 2019, 11:49 AM IST
Highlights

 భారీఎత్తున తరలి వచ్చిన ఊరేగింపు కారణంగా నగర రోడ్లపైనా చెత్తాచెదారం పెరిగిపోయింది. శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసి అధికారులు సాగర్‌లోని వ్యర్థాల తొలగింపు పనులుచేపట్టారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేయడంతోపాటు, ప్రత్యేకంగా కొన్ని క్రెయిన్‌లును ఉపయోగిస్తున్నారు. 

వినాయక చవితి సంబరాలు ముగిసాయి. 11రోజుల పాటు గణనాథుడిని భక్తితో పూజించిన భక్తులు నిమజ్జన కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. భక్తులు స్వామి వారిని నిమజ్జనం చేయగానే జీహెచ్ఎంసీ అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. చెరువుల్లో వ్యర్థాలను తొలగించి వాటిని తిరిగి శుభ్రపరిచే పనిలో పడ్డారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసిన విగ్ర హాలతో పాటు పూజలో వినియోగించిన సామగ్రిని కూడా చెరువులోనే వేసేశారు. 

ఇక భారీఎత్తున తరలి వచ్చిన ఊరేగింపు కారణంగా నగర రోడ్లపైనా చెత్తాచెదారం పెరిగిపోయింది. శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసి అధికారులు సాగర్‌లోని వ్యర్థాల తొలగింపు పనులుచేపట్టారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేయడంతోపాటు, ప్రత్యేకంగా కొన్ని క్రెయిన్‌లును ఉపయోగిస్తున్నారు. 

చెరువులోని వ్యర్థాలను తరలించడానికి 100 వాహనాలను  వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.దీని ద్వారా ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు 3,500 మెట్రిక్‌టన్నుల వ్యర్థాలను అధికారులు తరలించినట్టు తెలిపారు. కేవలం ట్యాంక్ బండ్ లోనే 45వేల వినాయక విగ్రహాలకు నిమజ్జనం నిర్వహించినట్లు అధికారులు  చెబుతున్నారు. 

గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన నిమజ్జనం మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. అర్థరాత్రి నుంచి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకూ నిమజ్జనం కొనసాగింది. దీంతో టాంక్‌బండ్‌పై ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీస్‌, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండి, ఆర్‌అండ్‌బి అధికారులుప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సాయంత్రానికి టాంక్‌బంబ్‌ పై సాధారణ పరిస్థితి నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.


 

click me!