భారీగా వరద నీరు... జలదిగ్భంధంలో మహానంది ఆలయం

By telugu teamFirst Published Sep 17, 2019, 10:03 AM IST
Highlights

పంచలింగాల మంటపం, కోనేర్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ భారీ వర్షాలకు వరదలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే ఆలయం నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. 

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయం జల దిగ్భంధంలో చిక్కుకుంది. మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం, కోనేరు నీట మునిగాయి. వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పంచలింగాల మంటపం, కోనేర్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ భారీ వర్షాలకు వరదలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే ఆలయం నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. నిత్య అసవరాలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

click me!