కేసీఆర్ కు భయం, అందుకే కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు: మాజీ మంత్రి డీకే అరుణ

By Nagaraju penumalaFirst Published Sep 9, 2019, 9:11 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  

మహబూబాబాద్‌: కాంగ్రెస్, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమ్ అయిపోయినట్లేనని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  

టీఆర్ఎస్ లో ఓనర్ల ఇష్యూ నడుస్తోందని విమర్శించారు. ఈ ఓనర్ల గొడవ ఇక్కడితో ఆగిపోదని త్వరలోనే పెద్ద ప్రమాదంగా పరిగణించబోతుందని తెలిపారు. భయంతోనే కేసీఆర్‌ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు మాజీమంత్రి డీకే అరుణ. 
 
click me!