కోడెల తనయుడు శివరాంకు షరతులతో కోర్టు బెయిల్

Published : Oct 01, 2019, 04:23 PM ISTUpdated : Oct 01, 2019, 04:25 PM IST
కోడెల తనయుడు శివరాంకు షరతులతో కోర్టు బెయిల్

సారాంశం

కోడెల శివరాం కు నర్సరావుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.


గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు కోర్టు మంగళవారం నాడు బెయిల్ ఇచ్చింది.  నర్సరావుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కోడెల శివరాం లొంగిపోయాడు.

ఈ కేసు విషయమై కోడెల శివరాంకు షరతులతో కూడిన బెయిల్‌ను  మంగళవారం నాడు కోర్టు ఇచ్చింది. కోడెల శివరాం నర్సరావుపేటలో ఉండడం, తిరగడంపై ఆంక్షలు విధించింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నర్సరావుపేటలో ఉండకూడదని కోడెల శివరాంను కోర్టు ఆదేశించింది.  కే ట్యాక్స్ పేరుతో కోడెల శివరాం డబ్బులు వసూళ్లు చేశారని పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై కేసులు కూడ నమోదయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?