కరోనా వైరస్ సోకినట్లు అనుమానమా... అయితే మీరు చేయాల్సిందిదే: మంత్రి నాని

Arun Kumar P   | Asianet News
Published : Jan 31, 2020, 05:26 PM IST
కరోనా వైరస్ సోకినట్లు అనుమానమా... అయితే మీరు చేయాల్సిందిదే: మంత్రి నాని

సారాంశం

28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాసకు ఇబ్బంది ఉంటే మాస్క్ వినియోగించడంతో పాటు సమీపంలోని డాక్టర్ ను సంప్రదించాలని  ఏపి వైద్యశాఖ  మంత్రి నాని ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఆయన వైద్య అధికారులను అప్రమత్తం చేశారు.  •

అమరావతి: కరోనా వైరస్ పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖాధికారులందరూ పూర్తి అప్రమంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ఆదేశించారు. ఈ మేరకు ఆయన కరోనా వైరస్ పై రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. 

28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వెంటనే మాస్క్ ధరించడంతో పాటు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. అత్యవసర సమాచారం కోసం 1100, 1102 టోల్ ఫ్రీ నంబర్లకు లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. 

కరోనా వైరస్ పర్యవేక్షణకు జిల్లాలు వారీగా వెంటనే నోడల్ అధికారులను నియస్తున్నట్టు తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కరోనా వైరస్ ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని దానిలో భాగంగా స్కానింగ్ పరికరాలు, మాస్క్ లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి నాని ఆదేశించారు. 

read more చెన్నైలో మహిళకు కరోనా వైరస్ లక్షణాలు

కరోనా వైరస్ పై ఇప్పటికే రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు జిల్లా స్థాయి వరకూ ఇచ్చిన మార్గదర్శక ఆదేశాలు జిల్లాలకు చేరాయా అని మంత్రి ఆరా తీశారు. వివిధ జిల్లాల పరిధిలోని ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి నాని  ఆదేశించారు.

కరోనా వైరస్ పై జిల్లాల వారీగా నియమించిన నోడలు అధికారులు వారి ఫోన్ నంబర్లు:

శ్రీకాకుళం -డా.బి.జగన్నాథరావు- 9963994337
విజయనగరం  -డా.యమ్.చామంతి -9492024155  
విశాఖపట్నం  -డా.యమ్.పార్థసారధి- 7382555264 
తూర్పు గోదావరి -డా.యమ్ మల్లికార్జున్-9392133322 
పశ్చిమ గోదావరి -డా.కె.సురేశ్ బాబు-9440471232 
కృష్ణా -డా.అమృతం -9491647614  
గుంటూరు -డా.పి.రత్నవల్లి -8309176892.
నెల్లూరు -డా.ఆర్.స్వర్ణలత -9440294507 
చిత్తూరు -డా.సుదర్శన్ -8790995129
కడప -డా.కె.కొండయ్య -9848399496.
అనంతపురం -డా.సి.పద్మావతి  -9849902398
కర్నూలు -డా.సి.శ్రీదేవి  -9849902411  

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?