బుల్ బుల్ తుఫాను మరింత తీవ్రరూపం...హెచ్చరికలు జారీ

By Arun Kumar P  |  First Published Nov 7, 2019, 9:49 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా రూపాంతరం చెందుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి బుల్ బుల్ అని నామకరణం చేసినట్లు....దీని ప్రభావం  కోస్తాపై కూడా వుంటుందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తోందని తెలిపారు.  


బంగాళాఖాతంలో  ఏర్పడిన బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్ర రూపం దాల్చుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు తెలిపారు.తూర్పు బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఈ తుపాన్‌ కేంద్రీకృతమైందని తెలిపారు. 

ఇది ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరాన, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవులకు 920 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయాన కేంద్రీకృతమై వుందని తెలిపారు. ఇది ఇవాళ రాత్రికి మరింత తీవ్రమైన వాయుగుండంగా మారి 24 గంటల్లో తుఫానుగా, ఈ నెల 9 నాటికి తీవ్రతుఫాన్ గా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

Latest Videos

ఇది పెను తుపాన్‌గా మారిన తర్వాత పశ్చిమ వ్యాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు వెళ్లనుంది. తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. 

పొంచివున్న బుల్ బుల్ తుఫాను...కోస్తాలో ప్రమాద హెచ్చరికలు జారీ

కోస్తాలోని అన్ని ప్రధాన పోర్ట్‌లలో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపానుకు బుల్ బుల్ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణించి  ఒరిస్సా లేదా పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ ప్రభావం కోస్తాపై కూడా వుండే అవకాశం వుండటంతో అన్ని ప్రధాన పోర్ట్ లను అప్రమత్తం చేశారు.  

 అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.

read more  బంగాళాఖాతంలో వాయుగుండం... పొంచివున్న తుపాను ముప్పు

పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి తెలంగాణలో సగటు వర్షపాతం 84.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 137.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

అక్టోబర్ మూడో వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఉంటుందన్న ఇండో-జర్మన్ పొట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ద్వారా ఈ సంస్థ నాలుగేళ్లుగా వాతావరణ మార్పులపై అంచనా వేస్తోంది.
 

click me!