ఎనిమిదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం

Published : Sep 07, 2019, 07:38 AM IST
ఎనిమిదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం

సారాంశం

విశాఖపట్నంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు తన ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. పెందుర్తి సిఐ సత్యనారాయణ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 

విశాఖపట్నం: ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సిఐ సత్యనారాయణ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నంలో నగరంలోని ప్రహ్లాదపురం ప్రాంతంలో పక్కపక్కనే బాలుడు, బాలిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

ఈ నెల 4వ తేదీన ట్యూషన్ కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరలేదు. దాంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. అయితే, అనుమానం వచ్చి పక్కింట్లో చూశారు. ఆ సమయంలో బాలుడు, బాలిక ఇరువురు ఇంట్లో కనిపించారు. 

బాలుడి తల్లిదండ్రులు ఆ సమయంలో ఇంట్లో లేరు. తమ కూతురిపై బాలుడు అత్యాచారం చేసినట్లు వారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్ కు తరలిం్చారు. 

PREV
click me!

Recommended Stories

Amaravati or Amaravathi : ఏపీ రాజధాని పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసా..?
KIMS Hospital : ఒకటి రెండు కాదు మూడుసార్లు గుండె ఆగింది.. అయినా ప్రాణాలతో బయటపడ్డ మహిళ