ప్రజలే ముఖ్యం.. అవసరమైతే గంగుల నానితో భేటీ: భూమా అఖిలప్రియ

By Siva KodatiFirst Published Oct 3, 2019, 7:55 PM IST
Highlights

పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను  పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు

పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

ఇప్పటికే యురేనియం బారిన పడిన కడప జిల్లా తుమ్మలపల్లి లో నీబాధితులను చూసైనా నేతలు , అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని అఖిలప్రియ హితవు పలికారు.

మరోవైపు ఆళ్లగడ్డ మండలం యాదవాడ సమీపాన జరిగిన యురేనియం కోర్ డ్రిల్లింగ్ పనులను తాము చొరవ తీసుకొని ప్రజల మద్దతుతో బంద్ చేయించిన సంగతిని ఆమె గుర్తు చేశారు.

ఆళ్లగడ్డ మండలం పరిసర ప్రాంత ప్రజలకు యురేనియం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో అన్న దానిపైన తుమ్మలపల్లి లో నష్టపోయిన బాధితులను తీసుకొని వచ్చి ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తామని అఖిలప్రియ స్పష్టం చేశారు.

ఈ విషయానికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ కు ఏర్పాటు చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని ని కూడా ఆహ్వానిస్తామని ఆమె తేల్చిచెప్పారు. 
 

click me!