మంత్రి అవంతికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

Siva Kodati |  
Published : Sep 18, 2019, 06:38 PM ISTUpdated : Sep 18, 2019, 06:39 PM IST
మంత్రి అవంతికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన దేవీపట్నం బయలుదేరి సహాయక చర్యలు పర్యవేక్షించారు

వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన దేవీపట్నం బయలుదేరి సహాయక చర్యలు పర్యవేక్షించారు.

అప్పటి నుంచి రాజమండ్రిలోనే మకాం వేసిన అవంతి శ్రీనివాస్ బాధితులకు అండగా నిలబడి రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిస్తున్నారు.

మరోవైపు బోటు ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కచ్చలూరు వద్ద గోదావరిలో ఆయిల్ తెట్టు ఆధారంగా పడవ ఉన్న ప్రాంతాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. ఇది నదీగర్భంలో 300 అడుగుల లోతులో ఉండవచ్చని భావిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?