ప్రభుత్వమే కాదు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా... జగన్ ప్రభుత్వ కీలక ప్రకటన

By Arun Kumar PFirst Published Dec 13, 2019, 8:31 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించే కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.  

అమరావతి: విద్యావిధానంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడానికి సిద్దమైన ప్రభుత్వం దీని ప్రభావం తెలుగు బాషపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ  క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వున్న అని పాఠశాలల్లో(ప్రభుత్వ, ప్రైవేట్) తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారికి ఉత్తర్వులకు తాజాగా విడుతల చేసింది. 

రానున్న విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాదు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనూ  విద్యార్థులకు ఇకనుండి తెలుగు సబ్జెక్ట్ ను తప్పకుండా బోధించాల్సిందే. 

read more  డిగ్రీ చదివాను... అయినా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు: మహిళా మంత్రి ఆవేదన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న పట్టుదలతో వున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల మాతృబాష తెలుగు చిన్నారులకు పూర్తిగా దూరమవుతుందని... కొన్నాళ్లుపోతే అంతరించిపోయే అవకాశముందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన వంటి ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

ఈ పార్టీల నోరు మూయించడంతో పాటు తెలుగు బాషపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉత్తర్వులతో అటు ఇంగ్లీష్ మీడియం విద్యను నిరుపేదలకు అందించాలన్న ప్రభుత్వం ఆశయం నెరవేరడంతో పాటు అనివర్గాలకు చెందిన విద్యార్థులకు మాతృబాషను నేర్పించే  అవకాశం కలిగింది. 

read more  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం... పరిస్థితి ఎలా వుందంటే: టీచర్ల ఆవేదన

రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంశంపై పుష్ప శ్రీవాణి మాట్లాడారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో తెలుగుమీడియంలో చదివానని, 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాసైన తాను ఇంగ్లీష్ రాని కారణంగా చదువులో వెనుకబడిపోయానని చెప్పారు. డిగ్రీని ఇంగ్లీష్ మీడియంలో చదివిన కారణంగా తనకు ఇప్పటికి ఇంగ్లీష్ బాగా అర్థమైనా, తిరిగి మాట్లాడలేనని తెలిపారు. 

దీనికి ఉదాహరణనిస్తూ ఇటీవల విశాఖలో గిరిజన శాఖకు చెందిన గురుకుల విద్యార్థులతో ఏర్పాటైన సైన్స్ ఫేర్ కు ఆ శాఖ మంత్రిగా హాజరయ్యానని.. అందులో పాల్గొన్న విద్యార్థులు తాము ప్రదర్శిస్తున్న అంశాలను గురించి ఇంగ్లీష్ లో వివరిస్తుంటే తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడలేక బాధపడ్డానని చెప్పారు. ఈ విషయం చెప్పుకోవడానికి తాను సిగ్గుపడటం లేదన్నారు.  

పేద పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి ముఖ్యమంత్రి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చుకోగలిగే ఆస్తి చదువు మాత్రమే కావడంతో చిరుద్యోగుల నుంచి రోజు కూలీ చేసుకొనే పేదల దాకా కూడా తమ పిల్లలను ఏదో ఒక చిన్న ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారని చెప్పారు. అలాంటి నిరుపేద తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ఇంగ్లీష్ బాష విద్యార్థులకు ఎంత అవసరమో గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టానిక నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 

tags
click me!