ఆడిస్తానంటూ తీసుకెళ్లి: మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

Siva Kodati |  
Published : Sep 13, 2019, 08:41 AM ISTUpdated : Sep 13, 2019, 08:45 AM IST
ఆడిస్తానంటూ తీసుకెళ్లి: మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. మణుగూరులోని పైలట్ కాలనీకి చెందిన ఓ కుటుంబం కూలీ పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో చిన్నారిని ఇంట్లోనే నానమ్మ దగ్గర వదిలి తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లారు.

ఇదే సమయంలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి పాపను ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఏడుస్తున్న చిన్నారిని తీసుకుని ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎంతకు బాలిక ఏడుపు ఆపకపోవడంతో ఆమె నానమ్మకు సందేహం కలిగింది.

పాపకు ఏమైందని ఆమె ప్రశ్నించగా.. సదరు వ్యక్తి పారిపోయాడు. సాయంత్రం కూలిపనుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలిక తల్లిదండ్రులకు వృద్ధురాలు విషయం చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...