భారత్- న్యూజిలాండ్ సెమీఫైనల్...మైదానంలోనే టీమిండియా అభిమానుల నిరసన

By Arun Kumar PFirst Published Jul 10, 2019, 2:58 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీ ఆరంభ మ్యాచులకు అడ్డంకి సృష్టించిన వరుణుడు మళ్లీ చివర్లోనూ అదేపని చేస్తున్నాడు. మాంచెస్టర్ వేదికన ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ కు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.అయితే ఇదిచాలదన్నట్లు మంగళవారం మాంచెస్టర్ మైదానంలో మరో గందరగోళం ఏర్పడింది. కొందరు భారత అభిమానుల మూలంగా ఈ మ్యాచ్ కు నిరసన సెగ తాకింది.  

ప్రపంచ కప్ టోర్నీ ఆరంభ మ్యాచులకు అడ్డంకి సృష్టించిన వరుణుడు మళ్లీ చివర్లోనూ అదేపని చేస్తున్నాడు. మాంచెస్టర్ వేదికన ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ కు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీంతో 2019 ప్రపంచ  కప్ తొలి ఫైనలిస్ట్ ఎవరో మంగళవారమే తేలాల్సి వుండగా  అదికాస్తా బుధవారానికి వాయిదా పడింది. అయితే ఇదిచాలదన్నట్లు మంగళవారం మాంచెస్టర్ మైదానంలో మరో గందరగోళం ఏర్పడింది. కొందరు భారత అభిమానుల మూలంగా ఈ మ్యాచ్ కు నిరసన సెగ తాకింది.  

ఇండియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో కొందరు సిక్కు యువకులు ప్రేక్షకుల పోడియంలోనే ఆందోళనకు దిగారు. ఖలిస్థాన్ కు మద్దతిచ్చే నినాదాలను ముద్రించిన టీషర్టులను నిరసనకారులు ధరించారు. అంతేకాకుండా గట్టిగా నినాదాలు చేస్తూ మ్యాచ్ కు ఆటంకం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే  మైదానంలోంచి బయటకు పంపించారు.

అయితే లీగ్ దశలో ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ జెట్ మైదానంంపైనుంచి వెళుతూ కాశ్మీర్ కు సంబంధించి వివాదాస్పద నినాదాలతో కూడిన బ్యానర్ ను ప్రదర్శించింది. దీంతో  బిసిసిఐ ఆటగాళ్ల భద్రత, ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఐసిసి సెమీఫైనల్ మ్యాచ్ కోసం  కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ జరుగుతున్న మాంచెస్టర్ మైదానం  పై నుండి విమానాలేవీ ఎగరకుండా నో ప్లై జోన్ గా ప్రకటించారు. అయినా కూడా ఈ మ్యాచ్ కు నిరసన సెగ తప్పలేదు.  

click me!