ఇండో పాక్ మ్యాచ్ కోసం గేల్ ప్రత్యేక వేషధారణ... తన పుట్టిన రోజున కూడా ఇలాగేనట

By Arun Kumar PFirst Published Jun 17, 2019, 2:43 PM IST
Highlights

దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నిన్న(ఆదివారం) రసవత్తర పోరాటం జరిగిన విషయ తెలిసిందే. ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగా ప్రపంచ కప్ లీగ్ దశలో భాగంగా ఇండో పాక్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇలా చాలా రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్ చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు, విశ్లేషకులు, ప్రజలే  కాదు మరో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు  కూడా ఎదురుచూశారు. అందుకు నిదర్శనమే గేల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. 

ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లకు మద్దతు తెలుపుతూ గేల్ ఓ ట్వీట్ చేశాడు. ప్రత్యేకంగా రూపొందిచిన ఓ సూట్ ను ధరించిన గేల్ ఆ ఫోటోనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ సూట్ కుడివైపు భారత్ కు చెందిన త్రివర్ణ పతాక రంగులతో...ఎడమవైపు పాక్ జెండా రంగుతో రూపొందించి  వుంది. ఇలా గేల్ ఇరుదేశాలకు తన మద్దతు ప్రకటించాడు. 

ఈ ఫోటోకు గేల్ ఓ కామెంట్ జతచేశాడు. ''  ఇండియా, పాకిస్థాన్ సూట్ లో నేను అద్భుతంగా వున్నాను. ఇరు దేశాల ప్రజలు తనను ఎంతగానో గౌరవిస్తూ ప్రేమాభిమాలను చూపిస్తుంటారు. ఈ  ఇండో పాక్ పతాకాల రంగుల్లోని సూట్  నాకెంతో నచ్చింది.  నా పుట్టిన రోజు(సెప్టెంబర్ 20న)న కూడా ఇదే సూట్ ధరిస్తాను'' అని పేర్కొన్నాడు. 

అయితే నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచులో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఇలా పాక్ పై భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాల్సి ఉండగా ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.  
 
click me!