భారత జట్టులో కోహ్లీ తర్వాతి స్థానం అతడిదే: బ్రియాన్ లారా

By Arun Kumar PFirst Published Jun 22, 2019, 2:37 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే  ఓ వైపు విజయాలను అందిస్తూ మరోవైపు కీలక ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. ఇలా ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధవన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ లు జట్టుకు దూరమయ్యారు. ఇలా గాయాలతో సతమతమవుతున్న భారత జట్టుకు వెస్టిండిస్ దిగ్గజ ఆటగాడు ధైర్యాన్ని నూరిపోశాడు. టీమిండియాకు మెరికల్లాంటి యువ కిలాడీలు అందుబాటులో వున్నారని... వారిని ఉపయోగించుకుని ఆ జట్టు అద్భుతాలు చేయనుందని లారా పేర్కొన్నారు. 

ముఖ్యంగా లారా శిఖర్ ధవన్ స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కెఎల్ రాహుల్ ను ఆకాశానికెత్తేశారు. అతడో ప్రపంచస్థాయి బ్యాట్ మెన్ అంటూ కొనియాడారు. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత అంతటి టాలెంట్ కలిగిన ఆటగాడు రాహుల్. ఎప్పటికైనా కోహ్లీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించేది అతడేనని లారా అన్నాడు. 

ఇక రాహుల్ ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో ఓపెనర్ గా బరిలోకి దిగిన అనుభవం వుంది. కాబట్టి ప్రపంచ కప్ కు ధవన్ దూరమవడంతో వచ్చిన ఓపెనింగ్ అవకాశాన్ని అతడు అందిపుచ్చుకుంటాడని అన్నారు. కొత్త బంతిని ఎదుర్కోవడం అతడికి సమస్యగా మారుతుందని తాను అనుకోవడం లేదన్నారు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగినా ఓపెనర్ మాదిరిగానే ఆడేవాడని గుర్తుచేశాడు. ఇలా భారత జట్టులో టాలెంట్ కలిగిన యువ ఆటగాళ్లు చాలామంది వున్నారని...అవసరమైతే వారి సేవలను ప్రపంచ కప్ లో ఉపయోగించుకోవాలని లారా టీమిండియా మేనేజ్ మెంట్ సూచించారు. 

click me!