ప్రపంచ కప్ 2019: ''బలిదాన్ బ్యాడ్జ్'' వివాదం...ధోనిదే తప్పంటున్న గవాస్కర్

Published : Jun 08, 2019, 02:50 PM ISTUpdated : Jun 08, 2019, 02:51 PM IST
ప్రపంచ కప్ 2019:  ''బలిదాన్ బ్యాడ్జ్''  వివాదం...ధోనిదే తప్పంటున్న గవాస్కర్

సారాంశం

 ప్రపంచ కప్ టోర్నీలో తాము ఎదుర్కొన్న మొదటి మ్యాచ్ లోనే టీమిండియా ఘనవిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వాడిన గ్లోవ్స్ వివాదాస్పదమవుతున్నాయి. ధోని ధరించిన గ్లోవ్స్ పై ఇండియన్ ఆర్మీ అమర సైనికుల జ్ఞాపకార్థం ఉపయోగించి ''బలిదాన్ బ్యాడ్జ్'' లోగో వుండటమే ఈ వివాదానికి కారణం. మన దేశమంటే గిట్టని పాకిస్థాన్ నాయకులు, క్రికెటర్లు ధోని చర్యలను వ్యతిరేకించగా...వారికి ఐసిసి కూడా వంతపాడుతోంది. అయితే భారత అభిమానులు, బిసిసిఐ నుండి మాత్రం ధోనికి పూర్తి మద్దతు లభిస్తోంది.  అలాంటిది టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం ధోని చర్యలను తప్పబట్టడం సంచలనం రేపుతోంది. 

దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్ ముగిసినప్పటి నుండి ధోని గ్లొవ్స్ వివాదం కొనసాగుతూనే వుంది. తాజాగా దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్ ధోని గొప్ప క్రికెటర్ అని పొగుడుతూనే... ఈ విషయంలో మాత్రం అతడిదే తప్పన్నాడు. భారతీయ క్రికెట్ లో ధోనికి చాలా ప్రత్యేకమైన స్థానం వుండొచ్చు కానీ ఐసిసి దృష్టిలో ప్రతి క్రికెటర్ సమానమేనని పేర్కొన్నాడు. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ది కోసం వారు రూపొందించిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ధోని కూడా ఈ నిబంధనలను ఉళ్లంఘించకుండా వుంటే బావుండేదని గవాస్కర్ అన్నారు. 

దేశంపై ధోనికి ఎంత ప్రేమున్నా మైదానంలో మాత్రం అందరు ఆటగాళ్ల  మాదిరిగానే వ్యవహరించాల్సి వుంటుందన్నారు. అలా కాకుండా ప్రత్యేకమైన లోగోను కలిగిన గ్లోవ్స్ వాడటంవల్లే ఐసిసి అభ్యంతరం తెలిపిందన్నారు. ఇప్పుడు ధోనిని చూసి చేడకుండా వదిలేస్తే మిగతా ఆటగాళ్ళు కూడా అలాగే వ్యవహరించే అవకాశం వుంటుంది కాబట్టి ఐసిసి కఠిరంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. కాబట్టి ధోని వారికి సహకరిస్తేనే మంచిదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.   
 
PREV
click me!

Recommended Stories

రాయుడిని కాదని మయాంక్ ను ఎందుకు ఎంపిక చేశామంటే: ఎమ్మెస్కే ప్రసాద్
ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?