రవీంద్ర జడేజాను ఆడిస్తే టీమిండియాకు కలిగే లాభాలివే: హర్భజన్ సింగ్

By Arun Kumar PFirst Published Jul 5, 2019, 5:42 PM IST
Highlights

ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న 15మంది భారత ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒకడు. ఇలా జట్టులో వున్నాడన్న మాటే గాని ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తుది జట్టులో చోటు దక్కించుకోలేక  ప్రతి మ్యాచ్ లోనూ అతడు కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితమవుతున్నాడు. అయితే అతన్ని శ్రీలంకతో జరుగుతున్న  చివరి మ్యాచ్ లో ఆడించాలని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచిస్తున్నాడు.  

ప్రస్తుతం భారత జట్టు ఎదుర్కొంటున్న మిడిల్ ఆర్డర్ సమస్యను తీర్చగల సత్తా రవీంద్ర జడేజాకు వుందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అతడికి  శ్రీలంక మ్యాచ్ లో ఒక్క ఛాయిస్ ఇచ్చి చూడాలని టీమిండియా మేనేజ్ మెంట్ కు బజ్జీ సూచించాడు. 

ఇప్పటికే భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించింది కాబట్టి చివరి లీగ్ మ్యాచ్ లో కొన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని హర్భజన్ పేర్కోన్నారు. ముఖ్యంగా కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ కు ముందు మిడిల్ ఆర్ఢర్ సమస్యను ఎలా అధిగమించవచ్చో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. తాను మటుకు రవీంద్ర జడేజా ఒక్క అవకాశమివ్వాలని మాత్రం సూచిస్తున్నట్లు తెలిపాడు. 

అతడు ఆలౌ రౌండర్ కాబట్టి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లోనూ చాలా  ఉపయోగపడతాడని అన్నాడు. అతడి రాకతో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలపడటమే కాదు మిడిల్, డెత్ ఓవర్లలో బౌలింగ్ బలపడుతుందన్నాడు.  లెప్ట్ ఆర్మ్ స్పిన్ తో మిడిల్ ఓవర్లలో పరుగులివ్వకుండా  వికెట్లు పడగొట్టడంతో జడేజాకు మంచి ట్రాక్ రికార్డ్ వుందని...అది ఆ ప్రపంచ కప్ లోను కొనసాగించగలడని నమ్ముతున్నట్లు హర్భజన్ అభిప్రాయపడ్డాడు.   
 
click me!