పాక్ మ్యాచ్ లోనూ ధవన్ బ్యాటింగ్ చేయగలడు...కానీ: టీమిండియా ఫీల్డింగ్ కోచ్

By Arun Kumar PFirst Published Jun 14, 2019, 7:08 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ భారత్ కు మిశ్రమ అనుభవాన్ని కల్పించింది. ఈ  మ్యాచ్ గెలిచి విజయాన్ని అందుకున్నందుకు ఆనందించాలో లేక సెంచరీ బాది మంచి ఫామ్ లో వున్న ఓపెనర్ శిఖర్ ధవన్ గాయానికి గురవడంతో బాధపడాలో అర్థంకాని పరిస్థితి.  ఇలా బొటనవేలికి తీవ్ర గాయమవడంతో ధవన్  కొన్నిరోజులపాటు టీమిండియాకు దూరమయ్యాడు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక  ఇండో పాక్ పోరుకు కూడా ధవన్ దూరమవడం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ విషయంపై తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ శ్రీధర్ స్పందించాడు. 

శిఖర్ ధవన్ గాయంపై పెద్దగా ఆందోళన అవసరం లేదని శ్రీధర్ సూచించాడు.  బొటనవేలికి గాయమైనా బ్యాటింగ్ చేయడానికి ధవన్యకు ఎలాంటి ఇబ్బందిలేదని...కానీ ఫీల్డింగ్ మాత్రం చేయలేడన్నాడు. ముఖ్యంగా వేగంగా వచ్చే  బంతుల్ని అడ్డుకోవడం, క్యాచ్ లు పట్టడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందువల్లే ధవన్ ను ఆడించలేకపోతున్నామని శ్రీధర్ వెల్లడించాడు. 

పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో భారత ఫీల్డర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఆడతారన్న నమ్మకముందని తెలిపాడు. అందుకోసం ప్రత్యేకంగా ఆటగాళ్లతో ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా  చేయిస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫీల్డింగ్ చేసిన జట్టుకే విజయం వరిస్తుందని...ఆ లక్షణాలన్ని  వున్న టీమిండియా ఈ ప్రపంచ కప్ సాధింస్తుందని శ్రీధర్ ధీమా వ్యక్తం చేశాడు. 

click me!