''డిఆర్ఎస్ కాదు ధోని రివ్యూ సిస్టమే ఫెయిల్...అందువల్లే టీమిండియా ఓటమి''

By Arun Kumar PFirst Published Jul 1, 2019, 4:07 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఈ మెగాటోర్నీలోనే మొదటి ఓటమిని భారత జట్టు చవిచూసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో విఫలమైన భారత ఆటగాళ్లు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 306 పరుగులు మాత్రమే చేయగలిగారు. అయితే అత్యుత్తమ గేమ్ ఫినిషర్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని (31 బంతుల్లో 42 పరుగులు) చివరి వరకు నాటౌట్ గా కొనసాగినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో అతడిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తాజాగా మరో విషయంలోనూ ధోని విఫలమయ్యాడంటూ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  
 
నిన్నటి(ఆదివారం) మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు  ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు.తొలి వికెట్ కు ఓపెనర్లు జాసన్ రాయ్-బెయిర్ స్టో లు ఏకంగా 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని ఆరంభంలోనే విడదీసే చక్కటి అవకాశాన్ని భారత జట్టు కోల్పోయింది. 

హార్దిక్  పాండ్యా వేసిన 11 ఓవర్లో రాయ్ 20 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఈ ఓవర్లో ఐదో బంతి జాసన్ రాయ్ గ్లవ్స్ ను తాకుకుంటూ వెళ్లి ధోని చేతికి చిక్కింది. దీంతో భారత జట్టు అంపైర్ కు అప్పీల్ చేసినా అతడు నాటౌట్ గానే నిర్ధారించాడు.  అవకాశం వున్నప్పటికి భారత్ ఈ విషయంలో రివ్యూ కోరలేదు. దీంతో రాయ్ బ్రతికిపోయి కేవలం 57 బంతుల్లోనే 66 పరుగులు చేయగలిగాడు. దీంతో ఇంగ్లాండ్ 338 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

ఈ విషయంలో ధోనిని అభిమానులు తెగ  ట్రోల్ చేస్తున్నారు. గతంలో డిఆర్ఎస్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకున్న ధోని ఈ మ్యాచ్ లో మాత్రం ఆ పని చేయలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటివరకు డిఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొత్త అర్థాన్ని  చెప్పినవారే ఇప్పుడు అతడిని సోషల్ మీడియా వేదికల్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. 

''ధోని బ్యాటింగ్, కీపింగ్ లోనే కాదు డిఆర్ఎస్ విషయంలోనే విఫలమయ్యాడు...అతడి వల్లే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది'' అంటూ కొందరు అభిమానులు  అభిప్రాయపడుతున్నారు. ''ఇకనుండి డిఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ కాదు'' అని, '' ఈ ప్రపంచ కప్ తర్వాత కాదు ధోని ఇప్పుడే రిటైరయి యువకులకు ప్రపంచ కప్ ఆడే అవకాశమిస్తే బావుంటుంది'' అని మరికొందరు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ధోనిని ట్రోల్ చేస్తున్నారు. 
 
click me!