ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ఓటమి.. కారణమిదే: రవిశాస్త్రి

By Arun Kumar PFirst Published Jul 12, 2019, 2:58 PM IST
Highlights

ప్రపంచ  కప్ టోర్నీలో వరుస విజయాలతో లీగ్ దశను టీమిండియా అగ్రస్థానంతో సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇలా సునాయాసంగా సెమీఫైనల్ కు చేరిన భారత్ మూడో ప్రపంచ కప్  ట్రోఫీకి కేవలం రెండడుగుల దూరంలో నిలిచింది. మాంచెస్టర్ వేదికన జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడ్డ టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. అయితే ఈ  ఓటమిలో తమ ఆటగాళ్ల వైఫల్యమేమీ లేదంటూ అందుకు గల కారణాలేమిటో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తాజా బయటపెట్టారు. 
 
న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో మునిగిపోయిన భారత ఆటగాళ్ళకు రవిశాస్త్రి అండగా నిలిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన వెంటనే రవిశాస్త్రి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంలోనే ప్రత్యేకంగా సమావేశమై వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ''ఈ ఓటమిలో మీ తప్పేమీ లేదు... ప్రతిఒక్కరు జట్టును ఇక్కడివరకు తీసుకురాడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే ప్రతికూల పరిస్థితులే మనల్ని ఓడించాయి. అందువల్ల  ఎవరూ నిరాశ చెందవద్దు...భవిష్యత్ లో మనం మరిన్ని విజయాలు అందుకోవాలంటే ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి'' అంటే ధైర్యాన్ని నూపిపోసే ప్రయత్నం చేశాడు. 

అంతేకాకుండా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ధోని-జడేజాలు అద్భతమైన సెంచరీ భాగస్వామ్యంతో చెలరేగడాన్ని రవిశాస్త్రి గుర్తుచేశారు. ఈ  పోరాటం భారత్ ను గెలిపించలేకపోయినా ఆటగాళ్ళలో మంచి పోరాట స్పూర్తిని నింపింది. కాబట్టి టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇదో అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచిపోనుందని పేర్కొన్నారు. 

ఇక ఈ టోర్నీ ఆరంభంనుండి అదరగొట్టి వరుస సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మను ప్రశంసించారు. అలాగే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, బుమ్రా, షమీల ప్రదర్శన చాలా సంతృప్తికరంగా వుందన్నారు. ఇలా సమిష్టి  ప్రదర్శనతోనే టీమిండియా ఈ టోర్నీలో టాప్ స్థాయికి చేరుకుందని...దురదృష్టవశాత్తు సెమీఫైనల్లో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. కాబట్టి ఈ ఓటమి నుండి తొందరగా బయటపడాలని ఆటగాళ్లకు రవిశాస్త్రి సూచించాడు.
 
click me!