ప్రపంచ కప్ 2019: ఇంగ్లాండ్ పై మలింగ అద్బుత ప్రదర్శన... అరుదైన రికార్డు బద్దలు

By Arun Kumar PFirst Published Jun 22, 2019, 5:22 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శుక్రవారం శ్రీలంక సంచలన విజయాన్ని నమోదుచేసింది.  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ ను మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే లంక గెలుపులో సీనియర్ బౌలర్ లసిత్ మలింగ ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చడం ద్వారా ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టి కనీసం 233 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించనివ్వలేదు. ఇలా మలింగ ఒంటిచేత్తో శ్రీలంక జట్టును గెలిచిపించడమే కాదు ఓ అరుదైన ప్రపంచ కప్ రికార్డును నెలకొల్పాడు. 

ప్రస్తుత శ్రీలంక జట్టులో లసిత్ మలింగ ఒక్కడే సీనియర్ ప్లేయర్. ఈ టోర్నీతో కలుపుకుంటే అతడు ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచ కప్ లు ఆడాడు. ప్రతి ప్రపంచ కప్ లోనూ అతడు మెరుగ్గా రాణిస్తూ వచ్చాడు. దీంతో వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ వికెట్లు(50 వికెట్లు) పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. మలింగకు 50 వికెట్లు పడగొట్టడానికి కేవలం 26 మ్యాచులే పట్టింది.  

అంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్యా మురళీధరన్, ఆసిస్ బౌలర్ మెక్ గ్రాత్  పేరిట వుంది. వారు 30 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు. ఇలా వారి పేరిట వున్న రికార్డును ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా మలింగ బద్దలుగొట్టాడు. 
 
click me!