రోహిత్, సచిన్ లలో ఎవరు బెస్ట్...?ఐసిసి పోల్...: మాస్టర్ బ్లాస్టర్ స్పందనిదే

By Arun Kumar PFirst Published Jun 18, 2019, 5:37 PM IST
Highlights

దాయాది పాకిస్థాన్ జట్టును ప్రపంచ కప్ వంటి అంతర్జాతీయ టోర్నీలో చిత్తుగా ఓడించి టీమిండియా  మరోసారి సత్తా చాటింది. మాంచెస్టర్ వేదికన గత ఆదివారం ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. పాక్ బౌలర్లను  చితకొట్టిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ  ఏకంగా 113 బంతుల్లోనే 140  పరుగులు చేశాడు. ఇలా పాక్ ముందు భారత్ 337 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా తన అత్యుత్తమ ప్రదర్శనతో రోహిత్ యావత్ భారతీయుల అభిమానాన్ని చూరగొన్నాడు.  

అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ అద్భుతమైన షాట్ తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ను గుర్తుచేశాడు. 2003 ప్రపంచ కప్ లో ఇదే పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో సచిన్ కళాత్మకమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే షోయబ్ అక్తర్ బౌలింగ్ లో తన శరీరానికి కొద్ది ఎత్తులో వచ్చిన బంతిని అతిసునాయాసంగా  అప్పర్ కట్ గా మలిచి బౌండరీకి తరలించాడు. సేమ్ టు సేమ్ అలాంటి షాటే తాజాగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆడాడు. 

దీంతో వీరిద్దరి సిక్సర్లకు సంబంధించిన వీడియోను పక్కపక్కన పెట్టిన ఐసిసి అభిమానులకు ఓ పోల్ పెట్టింది.  ''2003 లో సచిన్, 2019 లో రోహిత్...ఎవరు అత్యుత్తమంగా ఆడారో చెప్పండి'' అంటూ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఆ వీడియోను దీనికి జతచేసింది. ఐసిసి ఇలా రోహిత్ ను తనతో పోలుస్తూ పెట్టిన పోల్ పై సచిన్ స్పందించాడు. 

ఐసిసి పోల్ పై సచిన్ తన వ్యక్తిగత ట్విట్టర్ లో ఈ  విధంగా ట్వీట్ చేశాడు. '' మేమిద్దరం( రోహిత్, సచిన్) భారత దేశానికి చెందిన వారిమే. అంతేకాకుండా మా ఇద్దరిదీ ముంబయే. కాబట్టి ఐసిసి ప్రశ్నకు సమాధానం దొరకడం చాలా కష్టం. అయితే టాస్ ద్వారా మా  ఇద్దరిలో ఎవరు ఉత్తమమో తేల్చవచ్చు. హెడ్స్ పడితే నేను, టెయిల్స్ పడితే అతడు గెలిచినట్లు'' అంటూ సచిన్ ఐసిసికి  కౌంటరిచ్చాడు. 

We both are from INDIA and in this case, AAMCHI MUMBAI as well....So heads I win, tails you lose! 😜 https://t.co/doUMk1QU2b

— Sachin Tendulkar (@sachin_rt)

click me!