ప్రధాని సార్... పాక్ టీంపై మీరే చర్యలు తీసుకొండి: కమ్రన్ అక్మల్ ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Jun 21, 2019, 3:45 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దాయాదుల మధ్య జరిగిన పోరులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న మెగా టోర్నీలో భారత్ ను ఓడించి విజయాన్ని అందుకోవాలన్న పాక్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో తమ జట్టు ఓటమికి అదీ చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో తట్టుకోలేకపోయిన అభిమానులు పాక్ జట్టు, ఆటగాళ్లు, పిసిబి అధికారులు, సెలెక్షన్ కమిటీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరయితే ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా ఈ విమర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. 

అక్మల్  పాకస్థాన్ టీంపై కేవలం విమర్శలు చేయడమే కాదు ఓ అడుగు ముందుకేసి చర్యలకు డిమాండ్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని...ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అతడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఫిర్యాదు చేశాడు. పిసిబి వల్ల ఇది సాధ్యం కాదని స్వయంగా తమరే చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏం చేస్తే పాక్ జట్టు పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందో లెజెండరీ క్రికెటర్ అయిన తమరికి  బాగా తెలుసని... సాధ్యమైనంత తొందరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అక్మల్ పాక్ ప్రధానిని కోరాడు. 

ఇప్పటికే ఓ అభిమాని ఏకంగా ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని న్యాయస్థానంలో పిటిషన్ ‌వేశారు. అలాగే ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన గుజరన్‌వాలా సివిల్ కోర్టు న్యాయమూర్తి పూర్తి వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కమ్రాన్ ఫిర్యాదుపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!