ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి...కివీస్ ప్రధాని ఏమన్నారంటే...

By Arun Kumar PFirst Published Jul 16, 2019, 12:05 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ సమరం ముగిసింది. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ఆతిథ్య జట్టే విజయం సాధించి టైటిల్ ను ఎగరేసుకుపోయింది.  ఇలా తమ న్యూజిలాండ్ జట్టు ఉత్కంఠ పోరులో అనూహ్య ఓటమిని చవిచూడటంపై ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్పందించారు. 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ సమరం ముగిసింది. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్  మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో  జరిగిన ఈ  టైటిల్ పోరుల ఇరు జట్టు సమఉజ్జీలుగా నిలవడంతో  మొదట మ్యాచ్, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది.  దీంతో ఐసిసి నిబంధనల ప్రకారం ఎక్కువ బౌండరీలు బాదిన జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఇలా తమ న్యూజిలాండ్ జట్టు ఉత్కంఠ పోరులో అనూహ్య ఓటమిని చవిచూడటంపై ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్పందించారు. 

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును వారి స్వదేశంలోనే సమర్ధవంతంగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ టీం ను ఆమె  ప్రశంసించారు. ఈ జట్టును చూస్తే తనకే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఎంతో గర్వంగా ఫీలవుతున్నారని  తెలిపారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై అవగా కేవలం అత్యధిక బౌండరీల ద్వారా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. కాబట్టి తమ జట్టు ఓడిపోయినట్లుగా తాను భావించడం లేదని...అయితే దురదృష్టవశాత్తు మాత్రమే టైటిల్ సాధించలేకపోయామని అన్నారు. 

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ కు జసిండా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మెగా టోర్నీ ద్వారా తమ క్రికెట్ జట్టు మరింత మెరుగయ్యిందన్నారు.   న్యూజిలాండ్ లో క్రికెట్ ను మరింత అభివృద్ది చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇలా మెరుగైన ఆటగాళ్లను తీర్చిదిద్దే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును ప్రోత్సహిస్తామని ప్రధాని జసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. 
 
 

click me!