టీమిండియాకు పాక్ అసలు పోటీయే కాదు...మరి ఎవరంటే: హర్భజన్

By Arun Kumar PFirst Published Jun 3, 2019, 8:23 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియాను ఆదిక్యతను ప్రదర్శించడం ఖాయమని టీమిండియా వెటెరన్ బౌలర్  హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. దాయాది పాక్ జట్టు భారత్ ఓడించడం కాదు కదా కనీసం కనీస పోటీని కూడా  ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ ఆడుతున్న పది దేశాల్లో భారత్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క ఇంగ్లాండ్ కు మాత్రమే వుందని హర్భజన్ పేర్కొన్నారు. 

ప్రస్తుతం ప్రపంచ కప్ ఆడుతున్న పాక్ టీం చాలా బలహీనంగా వుందన్నాడు. ప్రతిభ, అనుభవం లేని ఆటగాళ్లతో నిండిపోయిన ఆ జట్టు చాలా పేలవంగా ఆడుతోందని...ఆ విషయం విండీస్ మ్యాచ్ తోనే అర్థమయ్యిందన్నాడు. గతంతో పాకిస్థాన్-ఇండియాలు సమఉజ్జీలుగా వుండేవని...అందువల్లే ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు హోరాహోరీగా జరిగేవన్నారు. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం లేదని...10 సార్లు భారత్ -పాక్ తలపడ్డా తొమ్మిదిసార్లు టీమిండియానే గెలుస్తుందని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు. 

అయితే అలా ఒక్కసారి ఓడినా భారత జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కానీ ఏదో అదృష్టంకొద్ది పాక్ గెలిచినా పెద్ద ప్రయోజనం వుండదని...ఆ విజయం వారికి బోనస్ మాత్రమే అన్నారు. భారత అభిమానులు మిగతా ఎనిమిది జట్లతో ఓడినా సహిస్తారు కానీ పాక్ చేతిలో ఓటమిపాలైతే తట్టుకోలేరు. ఆ విషయం టీమిండియా ఆటగాళ్లకు కూడా తెలుసు కాబట్టి వారిపై ఒత్తిడి వుంటుంది.  ఆ ఒత్తిడిని అదిగమిస్తేనే మంచి ఫలితాన్ని రాబట్టగలమని ఆటగాళ్లకు హర్భజన్ సూచించారు. 

ప్రస్తుతం ఉపఖండం జట్లన్ని చాలా వీక్ గా వున్నాయని వాటితో భారత జట్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘాన్ లతో పాటు పాక్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా వుంది. కాబట్టి వాటిని మినహాయిస్తే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లతోనే ప్రధానంగా పోటీ వుంటుందన్నారు. మరీ ముఖ్యంగా ఆతిథ్య ఇంగ్లాండ్ మంంచి ఫామ్ లో వుంది కాబట్టి ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాలని టీమిండియాకు హర్భజన్ సూచించారు.  
 
click me!