టీమిండియాకు షాక్...వరల్డ్ కప్ నుండి శిఖర్ ధావన్ ఔట్

By Arun Kumar PFirst Published Jun 11, 2019, 1:41 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో విరుచుకుపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ దూరమయ్యాడు.  ఈ మ్యాచ్ లో తీవ్కంగా గాయమవడంతో మూడు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రపంచ కప్ టోర్నీకి అతడు దూరం కానున్నాడు. 

ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా  దక్షిణాఫ్రికా మ్యాచ్ తో ఆరంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించలేకపోయాడు. కానీ  ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం సెంచరీతో కదం తొక్కి భారత్ విజయంలో కీలక పాత్ర  పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా శిఖర్ నిలిచాడు. ఇలా మంచి ఫామ్ లోకి వచ్చిన మ్యాచ్ లోనే శిఖర్ గాయపడ్డాడు. దీంతో అతడు మూడు వారాలు అంటే దాదాపు ప్రపంచ కప్ లీగ్ దశ మొత్తం మ్యాచుల్లో టీమిండియా కు దూరం కానున్నాడు.

అతడు జట్టుకు దూరం కావడంతో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లలో ఒకరికి ఇంగ్లాండ్ ఫ్లైటెక్కే అవకాశం రానుంది. వీరిద్దరి వైపే సెలెక్టర్ల చూపు వున్నట్లు తెలుస్తోంది. అలాగే  రోహిత్ శర్మ తో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగనున్నాడు. కాబట్టి ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు నాలుగో స్థానంలో బరిలోకి దిగాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థానానికి న్యాయం చేసే ఆటగాడానే ఎంపిక చేసే అవకాశముంది. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో అద్భుతమైన సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ చేస్తుండగానే గాయపడ్డ అతడు  ఆ తర్వాత ఫీల్డింగ్ చేయలేదు. అతడి స్థానంలో రిజర్వ్ ప్లేయర్ గా రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు.
  
click me!