ఐసీసీ ప్రపంచకప్‌ 2019: పాక్‌పై విండీస్‌దే పైచేయి, కానీ

By Siva KodatiFirst Published May 31, 2019, 10:31 AM IST
Highlights

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అయితే మిగిలిన జట్లు అంతగా ప్రభావాన్ని చూపవా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి.

అయితే మిగిలిన జట్లు అంతగా ప్రభావాన్ని చూపవా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా గతంలో ఛాంపియన్లుగా నిలిచిన వెస్టిండీస్, పాకిస్తాన్‌లను అంత తక్కువగా అంచనా వేయాలేమంటున్నారు క్రీడా విశ్లేషకులు.

వరల్డ్‌కప్ ప్రారంభమైన 1975తో పాటు 1979 సంవత్సరాలలో వెస్టిండీస్ జట్టు తన భీకర ఆటతీరుతో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది.

ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే .. 1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బలమైన జట్లను మట్టికరిపించి సగర్వంగా కప్‌ను ముద్దాడింది. రెండు జట్లు ప్రతి కప్‌లోనూ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ మధ్యలోనే తప్పుకున్నాయి.

నిలకడ లేమి, వరుస ఓటములు వెక్కిరిస్తున్నప్పటికీ తమను తక్కువగా అంచానా వేయొద్దని చెబుతున్నాయి విండీస్, పాక్. 2017లో ఇంగ్లాండ్ గడ్డపైనే ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు పేస్ పిచ్‌లపై ఆడటం పాకిస్తాన్‌కు కలిసొచ్చే అంశం.

ఇక ఈ ఏడాది ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో డిఫెండిండ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై 421 పరుగులు చేసి విజయం సాధించింది విండీస్. ఇర ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో 10 సార్లు తలపడ్డాయి.

ఇందులో వెస్టిండీస్ 7 సార్లు, పాక్ మూడు సార్లు విజయం సాధించింది. ఇక ద్వైపాక్షిక వన్డేలలో వెస్టిండీస్ 70 సార్లు, పాకిస్తాన్ 60 సార్లు విజయం సాధించాయి. గణాంకాలు విండీస్‌దే ఆధిపత్యమని చెబుతున్నా తమను తక్కువగా అంచానా వేయొద్దని పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. ఈ రెండు జట్ల మధ్య నాటింగ్ హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. 

click me!