రోహిత్ కన్నా ముందే ఐదు శతకాలు బాదాడు: 64 ఏళ్ల క్రితమే

By Siva Kodati  |  First Published Jul 8, 2019, 12:39 PM IST

రోహిత్ శర్మ కన్నా ముందు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైడ్ వాల్కాట్ ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 1955లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో వాల్కాట్ 5 శతకాలు బాదాడు. 


టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసి సంగక్కర పేరిట ఉన్న రికార్డును హిట్ మ్యాన్ చేరిపేసి... ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో ఆరు సెంచరీలు చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ సరసన నిలిచాడు. అయితే రోహిత్ శర్మ కన్నా ముందు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైడ్ వాల్కాట్ ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

Latest Videos

1955లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో వాల్కాట్ 5 శతకాలు బాదాడు. కాగా.. ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ చేరగా.. ఆ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ మరో సెంచరీ చేస్తే ప్రపంచకప్‌లో ఏడు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. 

click me!