జోడీ: ధావన్, రోహిత్ శర్మ సాధించిన ఘనత ఇదీ...

By telugu teamFirst Published Jun 9, 2019, 8:16 PM IST
Highlights

ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్‌-ధావన్‌ల జోడీకి ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మాథ్యూ హేడెన్‌ల జోడీ సరనస రోహిత్, ధావన్ జోడీ నిలిచింది. అదే సమయంలో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిల్లో మూడో స్థానంలో నిలిచింది.

లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్‌ జోడి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా వంద, అంతకన్నా ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా నిలిచింది. 

ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్‌-ధావన్‌ల జోడీకి ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మాథ్యూ హేడెన్‌ల జోడీ సరనస రోహిత్, ధావన్ జోడీ నిలిచింది. అదే సమయంలో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిల్లో మూడో స్థానంలో నిలిచింది. 

ఇది వన్డేల్లో రోహిత్‌, ధావన్‌లకు 16వ సెంచరీ భాగస్వామ్యం. అంతకుముందు కోహ్లితో కలిసి రోహిత్‌ శర్మ 16 సెంచరీల భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్నాడు. 23వ ఓవర్‌లో రోహిత్‌ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో భారత జట్టు 127 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది.

తొలి ఏడు ఓవర్ల వరకూ ధావన్, రోహిత్ జోడి చాలా నెమ్మదిగా ఆడింది. దాంతో భారత జట్టు ఏడు ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులు మాత్రమే చేసింది. అటు తర్వాత ధావన్‌ ఆస్ట్రేలియా బౌలర్లతో ఆడుకున్నాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఊపు మీదికి వచ్చాడు. ఈ ఓవర్‌లో ధావన్‌ 14 పరుగులు రాబట్టుకోవడంతో భారత్‌ గాడిలో పడింది. 

ఆ తర్వాత నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 53 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో ధావన్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌ కూడా సమయోచితంగా ఆడాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 21వ ఓవర్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో అతను అర్థ సెంచరీ చేశాడు.

click me!