ఓరి బాబు ముందు ఆ బీర్ పక్కనబెట్టు.. హర్భజన్ లైవ్ ఇస్తుండగా ఇంట్రెస్టింగ్ సీన్.. వీడియో వైరల్

Published : Jun 10, 2023, 03:37 PM IST
ఓరి బాబు ముందు ఆ బీర్ పక్కనబెట్టు.. హర్భజన్  లైవ్ ఇస్తుండగా  ఇంట్రెస్టింగ్ సీన్.. వీడియో వైరల్

సారాంశం

WTC Final 2023: ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా  టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్  సింగ్ లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 


భారత్  - ఆస్ట్రేలియా మధ్య  ఓవల్ లో జరుగుతున్న  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది.  మూడో రోజు ఆటముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల లీడ్ లో  ఉంది.  కాగా   మూడో రోజు ఆట ముగిశాక   ఈ మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న  స్టార్.. టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్  సింగ్, దినేశ్ కార్తీక్ లతో  మూడో రోజు ఆట,  ఆస్ట్రేలియా టార్గెట్, భారత్ కు గెలుపు అవకఆవాల వంటి వాటి గురించి సీరియస్ గా చర్చిస్తుండగా  ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.  

భజ్జీ - దినేశ్ కార్తీక్ లు సీరియస్ గా చర్చించుకుంటుండగా.. వెనకాలే ఉన్న  కొంతమంది అభిమానులుఈ ఇద్దరి సంభాషణను ఆసక్తిగా వింటున్నారు. ఇదే క్రమంలో వాళ్లంతా   ఓ బెంచ్ ముందు బీర్ గ్లాస్ లు పెట్టుకుని  కెమెరాలో కనిపించారు.  
 
ఇది గమనించిన కెమెరామెన్..  హర్భజన్ కామెంట్రీని ఆసక్తిగా వింటున్న ఓ సర్దార్ ను పిలిచి అది తీసేయాలని కోరాడు.  ముందు ఆ సర్దార్ కు కెమెరామెన్ ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు.  కానీ  తర్వాత కెమెరామెన్ స్పష్టంగా  బీర్ గ్లాస్ అని చెప్పడంతో తేరుకుని దానిని అక్కడ్నుంచి తీసి కెమెరాకు కనబడని చోటులో పెట్టాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు  నెట్టింట వైరల్ అయింది. 

 

ఈ వీడియోకు నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘వాస్తవానికి కెమెరామెన్   బీర్ గ్లాస్ ను తీయమనలేదు. తనకు కూడా ఓ సిప్ ఇవ్వమన్నాడు. కానీ ఆ  సర్దారేమో అది అర్థం కాక  లోపల దాచుకున్నాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘ఏదేమైనా సర్దార్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే కేక.. ముఖ్యంగా లాస్ట్ లో ఆ థమ్సప్ అయితే సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా