కరోనాతో ఆటకు బ్రేక్.. కసరత్తుల వెంటపడ్డ క్రీడాకారులు

By telugu news teamFirst Published Mar 23, 2020, 8:36 AM IST
Highlights

కేవలం కోహ్లీ మాత్రమే కాదు.. చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు ఇదే మంత్రం పాటిస్తున్నారు. వారిలో మేరీకోమ్, పీవీ సింధు, అశ్విని  పొన్నప్ప తదితరులు ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
 

కరోనా వైరస్ ఎఫెక్ట్ క్రీడలపై కూడా పడింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుండటంతో ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడింది. దాంతోపాటు.. ఇతర క్రీడలన్నీ కూడా వాయిదా పడ్డాయి. దీంతో.. క్రీడాకారులంతా ఖాళీగా ఉండిపోయారు. ఈ ఖాళీ సమయాన్ని కసరత్తులు చేయడానికి వినియోగించుకుంటున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మామూలుగానే ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తాడు. సాధారణంగా మ్యాచ్ ల మధ్య ఏ మాత్రం ఖాళీ దొరికినా.. కసరత్తులు చేస్తుంటాడు. అయితే... ఇప్పుడు కరోనా దెబ్బతో ఐపీఎల్ కూడా వాయిదా పడింది. అందులోనూ హోం క్వారంటైన్ లో ఉన్నాడు. దీంతో... మళ్లీ కసరత్తులకు పదును పెట్టాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు.

4కేవలం కోహ్లీ మాత్రమే కాదు.. చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు ఇదే మంత్రం పాటిస్తున్నారు. వారిలో మేరీకోమ్, పీవీ సింధు, అశ్విని  పొన్నప్ప తదితరులు ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

‘ఈ ఖాళీ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను. మామూలు రోజుల్లో కంటే ఎక్కువ కసరత్తులు చేస్తున్నాను’ అంటూ మేరీకోమ్ ట్వీట్ చేశారు.

‘15 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ సాధన చేస్తూ వచ్చాను. తొలిసారి ఖాళీగా ఉన్నాను. అందుకే ఈ సమయంలో కసరత్తులు చేస్తున్నాను’ అంటూ పీవీ సింధు ట్వీట్ చేశారు.

click me!