కోహ్లీని వెంటాడిన బ్యాడ్‌లక్... ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా! భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..

Published : Feb 18, 2023, 01:37 PM IST
కోహ్లీని వెంటాడిన బ్యాడ్‌లక్... ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా! భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..

సారాంశం

139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం! బ్యాటుకి బంతి తగులుతున్నట్టు కనిపించినా పట్టించుకోని థర్డ్ అంపైర్.. 

టెస్టుల్లో కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ, ఢిల్లీ టెస్టులో బ్యాడ్ లక్ వెంటాడి పెవిలియన్ చేరాడు. 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అంపైర్స్ కాల్ కారణంగా పెవిలియన్ చేరాడు..

ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి నాథన్ లియాన్ ఊహించని షాక్ ఇచ్చాడు. 41 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన నాథన్ లియాన్, ఆ తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేసి, ఛతేశ్వర్ పూజారాని డకౌట్ చేశాడు.

69 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి పూజారా వికెట్ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా, 7 బంతులు ఆడి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 

15 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46/0 వద్ద భారత జట్టు, మరో 20 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయి 66/4 స్థితికి చేరుకుంది..

100వ టెస్టులో డకౌట్ అయిన రెండో భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛేతశ్వర్ పూజారా. ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ 1988లో తన వందో టెస్టులో న్యూజిలాండ్‌తో టెస్టులో డకౌట్ అయ్యాడు.  

విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 74 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 84 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసి తొలి మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ కుహ్నేమాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

టీవీ రిప్లైలో బంతి విరాట్ కోహ్లీ బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చిన థర్డ్ అంపైర్, బాల్ ట్రాకింగ్‌ ద్వారా అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. శ్రీకర్ భరత్ వికెట్‌తో ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇంకా ఆస్ట్రేలియా చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 100+ పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు. ఆసీస్‌కి 50-75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినా మ్యాచ్‌ని కాపాడుకోవాలంటే నాలుగో ఇన్నింగ్స్‌లో చాలా కష్టపడాల్సి ఉంటుంది..
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్
అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ