ధోని, కోహ్లీ వుంటే చాలు...నెంబర్ వన్ స్థానానికి దోఖా లేదు: చాహల్

By Arun Kumar PFirst Published May 16, 2019, 11:56 PM IST
Highlights

ఐపిఎల్ సమరం ముగిసింది. ఇక  టీమిండియా ప్రపంచ కప్ సమరం కోసం సిద్దమవుతోంది. దీంతో ఇన్నిరోజులు ఐపిఎల్ పై జరిగిన చర్చ ఇప్పుడు ప్రపంచ కప్  టోర్నీపై జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, మాజీలు, క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు  అందరూ వరల్డ్  కప్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో టీమిండియా యువ బౌలర్  యజువేందర్ చాహల్ కూడా ప్రపంచ కప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.  
 
ఈ నెల 22వ తేదీన భారత జట్టు ప్రపంచ కప్ కు ఆతిథ్యమివ్వనున్న ఇంగ్లాండ్ కు బయలుదేరనుందని చాహల్ తెలిపాడు. ఇలా తాము ముందుగానే  ఇంగ్లాండ్ వెళ్లడం వల్ల అక్కడి  వాతావరణ పరిస్థితులకు ఆటగాళ్లందరు  అలవాటు పడతారన్నాడు. అంతేకాకుండా ప్రాక్టీస్ మ్యాచులాడటం వల్ల పిచ్ లపై అవగాహన కలుగుతుందని...ఇది తమకెంతో ఉపయోగపడుతుందని చాహల్ అభిప్రాయపడ్డాడు.  

ప్రస్తుతం టీమిండియా జట్టు చాలా  బలంగా వుందన్నాడు.  కెప్టెన్ విరాట్ కోహ్లీ,  మాజీ కెప్టెన్ ధోని  జట్టులో వున్నంత కాలం తమదెప్పుడూ నెంబర్ వన్ జట్టేనని పేర్కొన్నాడు.  అంతేకాకుండా ధావన్,  రోహిత్ ల రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ  వుంది...కాబట్టి తమ బ్యాటింగ్ లైనప్ ని తట్టుకునే సత్తా  ప్రత్యర్థి బౌలర్లకు లేదన్నాడు. ఇక తమ జట్టు బౌలింగ్ కూడా బలంగా ఉంది. షమీ, బుమ్రా, భువనేశ్వర్ అద్భుతమైన ఫామ్  లో వున్నారని...ఇదే ఫామ్ ఈ మెగా  టోర్నీలోనూ కొనసాగుతుందని చాహల్ ధీమా వ్యక్తం చేశాడు.

టీమిండియాతో పాటు ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు కూడా ఈసారి హాట్ ఫేవరెట్ గా  బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగడం వారికి  కలిసొచ్చే అంశమన్నాడు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా  బలంగా కనిపిస్తున్నాయని...మొత్తానికి  ఈసారి ఫోటీ గట్టిగానే  వుండే  అవకాశముందన్నాడు. ఎంత  బలమైన జట్టునయినా ఎదురించి  గెలిచే సత్తా భారత్ కు వుందని...ఈ ప్రపంచ కప్ టీమిండియాదేనని చాహల్ జోస్యం చెప్పాడు. 

click me!