SRHvsRCB: అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలర్లు... ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ముందు ఈజీ టార్గెట్...

By team teluguFirst Published Nov 6, 2020, 9:08 PM IST
Highlights

హాఫ్ సెంచరీ చేసిన ఏబీ డివిల్లియర్స్...

మూడు వికెట్లు తీసిన జాసన్ హోల్డర్... రెండు వికెట్లు తీసిన నటరాజన్...

32 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్... ఫ్రీ హిట్‌లో మొయిన్ ఆలీ రనౌట్...

IPL 2020 సీజన్ మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సీజన్‌లో మొదటిసారి ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ 6 పరుగులకే అవుటై, తీవ్రంగా నిరాశపరిచాడు.

మంచి ఫామ్‌లో యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా 1 పరుగుకే అవుట్ కావడంత 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. ఆరోన్ ఫించ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 32 పరుగులు చేయగా మొయిన్ ఆలీ పరుగులేమీ చేయకుండానే ఆడిన మొదటి ఫ్రీ హిట్ బంతికి రనౌట్ అయ్యాడు.

శివమ్ దూబే 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులు చేసి అవుట్ కాగా ఏబీ డివిల్లియర్స్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 5 ఫోర్లతో 56 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్‌ను నటరాజన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో సిరాజ్, సైనీ రెండు బౌండరీలు బాదడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా నటరాజన్ రెండు వికెట్లు తీశాడు. నదీమ్‌కి ఓ వికెట్ దక్కింది. 

click me!