IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో మొదటి సగం మ్యాచులు ముగియగా, రెండో సగంలో ఇది మొదటి మ్యాచ్. 2020 సీజన్ మొదటి రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

11:28 PM (IST) Oct 13
Teams to Beat #SRH most times:
KKR - 11
CSK - 10*
MI - 8
RCB - 7
11:27 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో సీఎస్‌కే చేతిలో చిత్తుగా ఓడింది...
11:15 PM (IST) Oct 13
నదీమ్ అవుట్... సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి...
11:10 PM (IST) Oct 13
19వ ఓవర్ ఆఖరి బంతికి అవుటైన రషీద్ ఖాన్... 7 వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్. విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాలి...
11:04 PM (IST) Oct 13
18వ ఓవర్ ఆఖరి బంతికి నదీమ్ బౌండరీ బాదడంతో ఆ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. విజయానికి చివరి 2 ఓవర్లలో 27 పరుగులు కావాలి...
11:03 PM (IST) Oct 13
రషీద్ ఖాన్ వస్తూనే ఓ సిక్సర్, బౌండరీ బాదాడు... దీంతో విజయానికి 13 బంతుల్లో 31 పరుగులు కావాలి...
11:02 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.. సరైన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ లేకపోవడంతో దాదాపు మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.
11:00 PM (IST) Oct 13
విలియంసన్ అవుట్... 126 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:57 PM (IST) Oct 13
బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కేన్ విలియంసన్... 37 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు కేన్.
10:55 PM (IST) Oct 13
శంకర్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:52 PM (IST) Oct 13
17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విజయ్ శంకర్... సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 22 బంతుల్లో 52 పరుగులు కావాలి...
10:48 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. విజయానికి చివరి 24 బంతుల్లో 59 పరుగులు కావాలి...
10:44 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 100 పరుగుల మార్కు అందుకుంది. విజయానికి చివరి 5 ఓవర్లలో 67 పరుగులు కావాలి...
10:42 PM (IST) Oct 13
ప్రియమ్ గార్గ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:38 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. విజయానికి చివరి 6 ఓవర్లలో 75 పరుగులు కావాలి...
10:30 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. విజయానికి 48 బంతుల్లో 92 పరుగులు కావాలి... 12వ ఆఖరి రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు కేన్ విలియంసన్...
10:27 PM (IST) Oct 13
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 54 బంతుల్లో 104 పరుగులు కావాలి...
10:20 PM (IST) Oct 13
బెయిర్‌స్టో అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:18 PM (IST) Oct 13
9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి 11 ఓవర్లలో 111 పరుగులు కావాలి...
10:03 PM (IST) Oct 13
168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. వార్నర్ 9 పరుగులే అవుట్ కాగా, 4 పరుగులు చేసిన మనీశ్ పాండే రనౌట్ అయ్యాడు.
09:20 PM (IST) Oct 13
CSK While Defending 160+ target vs SRH
Won : 4
Lost : 1
09:19 PM (IST) Oct 13
సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ దాదాపు ఇదే స్కోరు చేసింది. అప్పుడు ఎస్ఆర్.హెచ్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగా, ఇప్పుడు చెన్నై 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది...
09:17 PM (IST) Oct 13
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...సన్‌రైజర్స్ టార్గెట్ 168 పరుగులు...
09:13 PM (IST) Oct 13
రవీంద్ర జడేజా వరుస బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్, ఓ బౌండరీతో చెలరేగడంతో 19.5 ఓవర్లలో 165 పరుగులు చేసింది సీఎస్‌కే...
09:10 PM (IST) Oct 13
బ్రావో డకౌట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్..
09:08 PM (IST) Oct 13
ధోనీ అవుట్... 19వ ఓవర్ ఆఖరి బంతికి ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్..
09:02 PM (IST) Oct 13
18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:55 PM (IST) Oct 13
17వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ... 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది చెన్నై.
08:53 PM (IST) Oct 13
నటరాజన్ బౌలింగ్‌లో ధోనీ ఓ బౌండరీ రాబట్టాడు. దీంతో 16.4 ఓవర్లలో 125 పరుగులకు చేరింది సీఎస్‌కే...
08:51 PM (IST) Oct 13
షేన్ వాట్సన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్..
08:49 PM (IST) Oct 13
16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది సీఎస్‌కే... 16 వ ఓవర్‌లో కేవలం 3 పరుగులే ఇచ్చి, అంబటి రాయుడిని అవుట్ చేశాడు ఖలీల్ అహ్మద్...
08:45 PM (IST) Oct 13
అంబటి రాయుడు అవుట్... 116 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్..
08:44 PM (IST) Oct 13
రషీద్ ఖాన్ మొదటిసారి ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్, ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు...
08:42 PM (IST) Oct 13
15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో అంబటి రాయుడు ఓ సిక్స్ బాదగా, షేన్ వాట్సన్ మరో సిక్సర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.
08:38 PM (IST) Oct 13
14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:33 PM (IST) Oct 13
13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:30 PM (IST) Oct 13
12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 13వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు షేన్ వాట్సన. దీంతో 12.1 ఓవర్లలో 90 పరుగులు చేసింది సీఎస్‌కే...
08:24 PM (IST) Oct 13
చెన్నై సూపర్ కింగ్స్ 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
08:02 PM (IST) Oct 13
6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
07:59 PM (IST) Oct 13
3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు సందీప్ శర్మ...