
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్... మార్చి 4న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. థాయ్ లాండ్‌లో తన విల్లాలో షేన్ వార్న్, అపస్మారక స్థితిలో పడి ఉన్న షేన్ వార్న్‌ను గుర్తించిన ఆయన స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే షేన్ వార్న్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు...
అయితే షేన్ వార్న్ మృతిపై థాయ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.షేన్ వార్న్ గదిలో రక్తపు మరకలు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. షేన్ వార్న్ ఉంటున్న గదిలో టవల్స్‌కి, ఫ్లోర్ అంతా రక్తపు మరకలు ఉండడాన్ని బట్టి చేస్తుంటే... ఆసీస్ స్పిన్ దిగ్గజం మరణానికి ముందు భయానక పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి...
‘రూమ్‌లో చాలా చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. వార్న్ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి, ఆయన కుటుంబ సభ్యులు సీపీఆర్ మొదలెట్టే సమయానికే తీవ్రమైన దగ్గుతో రక్తపు వాంతులు చేసుకుని మరణించినట్టు రిపోర్టులో తేలింది...’ అంటూ చెప్పుకొచ్చాడు లోకల్ పోలీస్ అధికారి సతిత్ పోల్‌పినిట్...
ఫ్లోర్‌పై, టవల్స్‌పై ఉన్న రక్తపు మరకలను చూస్తుంటే చనిపోయే ముందు షేన్ వార్న్ భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానిస్తున్నారు థాయ్ పోలీసులు...
అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆసీస్ స్పిన్ బౌలర్ షేన్ వార్న్. తన కెరీర్ లో 145 టెస్టులాడిన షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు, 194 వన్డే మ్యాచులు ఆడి 293 వికెట్లు తీశాడు.
బ్యాటింగ్‌లోనూ రాణించిన షేన్ వార్న్, టెస్టుల్లో 12 హాఫ్ సెంచరీలతో 3154 పరుగులు సాధించాడు. టెస్టుల్లో షేన్ వార్న్ అత్యధిక స్కోరు 99 పరుగులు... స్పిన్ మ్యాజిక్ తో టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన షేన్ వార్న్, 10 సార్లు టెస్టుల్లో 10 వికెట్ల తీసి అదురైన ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ అకాల మరణం క్రీడా ప్రపంచంలో విషాదం నింపింది. అయితే షేన్ వార్న్ మరణం తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించిన షేన్ వార్న్, కొన్ని రోజుల కిందట ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించాడు.
సరిగ్గా వారం రోజుల కిందటే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా వచ్చేందుకు ఎదురుచూస్తున్నానంటూ మనసులో మాట బయటపెట్టాడు షేన్ వార్న్... ‘ఇంగ్లాండ్ జట్టు కోచ్‌గా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇంగ్లాండ్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరించడం చాలా గొప్ప విషయం. నేను ఆ బాధ్యతను చక్కగా నిర్వహించగలనని నమ్ముతున్నా...టీమ్‌లో స్టార్ ప్లేయర్లు ఉన్నా, వాళ్లు సరిగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతుంటే... బేసిక్స్‌పైన ఫోకస్ పెట్టడమే సరైన పని...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్...
ఇంగ్లాండ్ జట్టును దరిద్రం పట్టి పీడిస్తోందని, ఆ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వెళ్లి బాగుచేయాలని అనుకున్నందుకే షేన్ వార్న్... ప్రాణాలు కోల్పోయాడని అంటున్నారు కొందరు నెటిజన్లు...