
సౌత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్లేయర్లలో సంజూ శాంసన్ ఒకడు. కేరళలో సంజూ శాంసన్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తది. అయితే టీమిండియాలో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవడంలో విఫలమవుతున్న సంజూ శాంసన్.. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఫోటో షేర్ చేశాడు...
‘ఏడేళ్ల వయసు నుంచే నేను సూపర్ రజనీ ఫ్యాన్‌ని. ఆ వయసులోనే మా అమ్మనాన్నలకు నేను, రజనీసార్‌ని ఆయన ఇంట్లోనే కలుస్తానని చెబుతూ వచ్చాను. 21 ఏళ్ల తర్వాత ఆ రోజు వచ్చింది. ది తలైవర్ స్వయంగా నన్ను ఆయన ఇంటికి పిలిచారు...’ అంటూ రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్...
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో సంజూ శాంసన్‌కి పిలుపు దక్కవచ్చని సమాచారం. యంగ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి వన్డే సిరీస్‌లో చోటు దక్కింది..
అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో బ్యాటుతో పర్వాలేదనే పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీకర్ భరత్, వికెట్ కీపింగ్‌లో మాత్రం ఈజీ క్యాచులను నేలపాలు చేశాడు. అందుకే అతని కంటే సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వడమే బెటర్ అని టీమిండియా సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం..
అయితే మరో నాలుగు రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంకా శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ గురించి కానీ, సంజూ శాంసన్‌ని చేర్చబోతున్న విషయం గురించి కానీ అధికారిక ప్రకటన చేయలేదు బీసీసీఐ.. సంజూ శాంసన్‌కి వన్డే సిరీస్‌లో చోటు దక్కినా అతను తుది జట్టులోకి రావడం అనుమానమే. ఎందుకంటే ఇషాన్ కిషన్, ఈ ఏడాది ఆరంభంలో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.
2022 ఏడాదిలో వన్డేల్లో 66 సగటుతో పరుగులు చేసిన సంజూ శాంసన్, 104కి పైగా సగటుతో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. రంజీ ట్రోఫీలో 85కి పైగా సగటుతో ఆకట్టుకున్నాడు. అయినా సంజూని పూర్తిగా సైడ్ చేసేసింది భారత జట్టు...
సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌కి సెట్ కాకున్నా అతన్ని సెలక్ట్ చేస్తూ, వరుస అవకాశాలు ఇస్తుండడం... సంజూ శాంసన్, వన్డేల్లో అదరగొడుతున్నా అతన్ని సైడ్ చేయాలని చూస్తుండడం బీసీసీఐలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయనడానికి నిదర్శనం అంటున్నారు అభిమానులు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు సంజూ శాంసన్. 2022 ఏడాదిలో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది..