పీఎం కేర్స్‌కు యూవీ విరాళం: సాయం చేశా.. దీపం వెలిగిస్తున్నానంటూ ట్వీట్

By Siva KodatiFirst Published Apr 5, 2020, 7:35 PM IST
Highlights

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ పిలపు మేరకు పీఎం కేర్స్‌కు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించాడు

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ పిలపు మేరకు పీఎం కేర్స్‌కు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించాడు.

ప్రత్యేకమైన ఈ రోజున పీఎంకేర్స్‌కు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని యువి తెలిపాడు. దేశమంతా ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటామని.. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నానని, తనతోపాటు మీరు కూడా వెలిగిస్తారా అని యువి ట్వీట్ చేశాడు.

Also Read:కరోనా దెబ్బ: ఇప్పుడిప్పుడే భారత్ లో పాపులారిటీ అప్పుడే ప్రపంచ కప్ వాయిదా!

ఈ ప్రత్యేకమైన రోజున పీఎం కేర్స్‌కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నానని, మీరు కూడా వీలైనంత సాయం చేయండి అంటూ యువరాజ్ పేర్కొన్నాడు. అతనితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా మోడీ చెప్పినట్లుగా దీపాలు వెలిగించాలని కోరాడు.

లక్షలాది మంది పారిశుద్ధ్య కార్మిక యోధుల అంకితభావాన్ని గౌరవిస్తూ ఆదివారం రాత్రి దీపాన్ని వెలిగిస్తున్నానని సచిన్ ట్వీట్ చేశాడు.

Also Read:మోడీ పిలుపు: స్పందించి, స్పందించమని కోరిన క్రీడాకారులు!

మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, మనల్ని సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారని సచిన్ కొనియాడారు. వీరి కోసం తాను దీపాన్ని వెలిగిస్తున్నానని.. అందరూ ఐక్యంగా ఉండండి అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. 

click me!