అదిప్పుడు లేదు: డేవిడ్ వార్నర్ మీద రోహిత్ శర్మ సెటైర్లు

Published : Apr 03, 2021, 04:35 PM IST
అదిప్పుడు లేదు: డేవిడ్ వార్నర్ మీద రోహిత్ శర్మ సెటైర్లు

సారాంశం

ఐపిఎల్ 2021 సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట పట్టించాడు. ఈసారి నీకు అది లేదని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

చెన్నై: ఐపీఎల్ 2021 ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇటీవలే తన జట్టుతో కలిశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఆటగాడు క్వారంటైన్ లో ఉండాలని బిసిసిఐ ఆదేశించింది. దీంతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డేవిడ్ వార్నర్ నేరుగా క్వారంటైన్ కు వెళ్లాడు. 

ఈ సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా వార్నర్ అభిమానులను ఉద్దేశించి పోస్టు పెట్టి వారిని సలహాలు అడిగాడు. "హాయ్ ఫ్యాన్స్... ఆసీస్ నుంచి ఇండియాకు చేరుకున్నా. అయితే ఐపిఎల్ నిబంధనల మేరకు వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు బోర్ కొట్టకుండా ఏవైనా మంచి సలహాలు చెప్పండి. అవసరమైతే కొన్ని మంచి సినిమాలు సజెస్ట్ చేయండి" అని అన్నాడు. 

డేవిడ్ వార్నర్ పోస్టుపై నెటిజన్లు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వార్నర్ ను ఆట పట్టించాడు. రోహిత్ శర్మ పెట్టిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. "వార్నర్... నిరుడు ఐపిఎల్ సీజన్ కు ముందు క్వారంటైన్ లో ఉన్నప్పుడు టీక్ టాక్ తో కాలం వెల్లబుచ్చావు. కానీ ఈసారి నీకు ఆ అవకాశం లేదు. కచ్చితంగా నువ్వు టిక్ టాక్ ను మిస్సవుతున్నావు" అని రోహిత్ శర్మ అన్నాడు. 

సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ ఐపిఎల్ కెప్టెన్లలో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో సన్ రైజర్స్ కెప్టెన్ గా ఎంపికైన ఆయన 2018లో తప్ప తన జట్టును ప్లేఆఫ్ కు చేర్చాడు. ఐపిఎల్ లో 142 మ్యాచులు ఆడిన వార్నర్ 5,254 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, 48 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐపిఎల్ 14వ సీజన్ లో సన్ రైజర్స్ తన తొలి మ్యాచులో ఏప్రిల్ 11వ తేదీన కేకేఆర్ ను ఎదుర్కుంటోంది.

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు