రైనాను మైదానంలోనే ఆటపట్టించిన పంత్...ధోనీతో జాగ్రత్త అంటూ అభిమానుల హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published May 2, 2019, 2:52 PM IST
Highlights

టీమిండియా యువ కెరటం రిషబ్ పంత్ అతి తక్కువ సమయంలో మంచి ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. భారత ఆటగాడిగా ఫరవాలేదనిపించినా ఐపిఎల్ లో అయితే అతడి విధ్వంసానికి అడ్డులేకుండా పోయింది. డిల్లీ క్యాపిటల్స్ తరపున బ్యాట్ మెన్ గా, వికెట్ కీపర్ గా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇలా తన ఆట విషయంతో పంత్ ఎంత సీరియస్ గా వుంటాడో సహచరులతోనూ అంతే సరదాగా వుంటాడు. జట్టు సభ్యులనే కాదు ప్రత్యర్థి ఆటగాళ్ళతో కూడా ఆటపట్టిస్తూ మైదానంలో వున్న సీరియస్ వాతావరణాన్ని ఒక్కసారిగా తేలిక చేస్తుంటాడు. ఇలా గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సురేష్ రైనా ను ఆటపట్టిస్తూ మైదానంలో నవ్వులు పూయించిన పంత్ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టాడు. 

చెన్నైలోని చెపాక్ స్టేడియంతో చెన్నై సూపర్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న రాత్రి ఆసక్తికరమైన మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న డిల్లీకి మంచి ఆరంభం  లభించింది. సుచిత్ బౌలింగ్ లో చెన్నై ఓపెనర్ వాట్సన్ భారీ షాట్ కు ప్రయత్నించి  డకౌటయ్యాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై శిబిరంలో కాస్త  ఆందోళన మొదలయ్యింది. ఇలా ఆరంభంలోనే వికెట్ పడటంతో వాట్సన్ స్థానంలో బ్యాటింగ్ క్ దిగిన సురేశ్ రైనా ఒత్తిడితోనే మైదానంలో అడుగుపెట్టాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్నాడో ఏమో డిల్లీ వికెట్ కీపర్ పంత్ ఓ చిన్న సంఘటనతో రైనా ముఖంలో నవ్వులు పూయించాడు. 

రైనా క్రీజులోకి వస్తుండగా పంత్ అతడికి అడ్డుగా నిలిచి ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. రైనా తప్పించుకోడానికి ఎటు వెళితే అటువైపుగా వచ్చి అడ్డుకున్న పంత్ క్రీజులోకి వెళ్లనివ్వలేదు. కాస్సేపు ఇలాగే రైనాను ఆటపట్టించిన తర్వాత అడ్డు తొలగాడు. ఈ కామెడీ సంఘటన వల్ల రైనాతో పాటు మైదానంలోకి మిగతా ఆటగాళ్లు, వీక్షకులు కూడా తెగ నవ్వుకున్నారు.  

అయితే ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియోను ఐపిఎల్ అధికారిక  వెబ్ సైట్ లో పెట్టగా నెటిజన్ల నుండి మరింత సరదా కామెంట్స్ వస్తున్నాయి. '' రైనాను ఆటపట్టిస్తూ క్రీజులోకి వెళ్లకుండా అడ్డుకుని మంచిపని చేశావ్...అదే ధోనితో ఇలా చేస్తే నీ పని అయ్యేది'' అంటూ కొందరు చెన్నై అభభిమానులు పంత్ ని హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు. ''బంగ్లాదేశ్ తో 2015 లో జరిగిన వన్డేలో ధోని క్రీజులో పరుగెత్తుతుండగా అనవసరంగా అడ్డువచ్చిన ముస్తాఫిజుర్ కు ఎలాంటి అనుభవం ఎదురయ్యిందో గుర్తుందా?'' అంటూ పంత్ కి గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ అభిమానులు హెచ్చరించారు. 
 
Just things 😅😅 pic.twitter.com/efUrfbzxBI

— IndianPremierLeague (@IPL)
click me!