ఐదేళ్ల బుడ్డోడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్... ఈ బుడతడు ఎవరంటే...

By Chinthakindhi RamuFirst Published Jun 22, 2022, 11:47 AM IST
Highlights

తన కుమారుడితో కలిసి ఓ ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్... ఐదేళ్ల కొడుకు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో...

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కొంత కాలంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌‌లో టీమిండియా చేతుల్లో పాకిస్తాన్ ఓటమి తర్వాత సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు వేసింది పాక్ క్రికెట్ బోర్డు. సర్ఫరాజ్ అహ్మద్‌ని తప్పించి, యంగ్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కి కెప్టెన్సీ అప్పగించింది...

కెప్టెన్‌గా పాకిస్తాన్‌కి మంచి విజయాలు అందించిన వరల్డ్ కప్ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు వికెట్ల వెనకాల సర్ఫరాజ్ అహ్మద్ ఆవలించడం... అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం ఫోకస్ పెట్టని సర్పరాజ్ అహ్మద్, భారీ పొట్టతో కనిపించడమే కాకుండా వికెట్ల మధ్యలో సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బందిపడేవాడు. ఇవి సర్ఫరాజ్ అహ్మద్‌పై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమయ్యాయి...

2017లో భారత జట్టును ఓడించి, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్‌కి కెప్టెన్ అయిన సర్ఫరాజ్ అహ్మద్, తాజాగా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సర్ఫరాజ్ అహ్మద్‌కి ఆయన ఐదేళ్ల కొడుకు అబ్దుల్లా బౌలింగ్ చేశాడు. బుడ్డోడి యార్కర్‌కి అవాక్కైన సర్ఫరాజ్, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Shabash Beta Abba ki he wicket he ura di 👏👏🔥 pic.twitter.com/rpvdxcNUVv

— Thakur (@hassam_sajjad)

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత వన్డే, టెస్టుల్లో చోటు కూడా కోల్పోయిన సర్ఫరాజ్ అహ్మద్, టీ20ల్లో మాత్రం అప్పుడప్పుడూ అవకాశాలు దక్కించుకోగలుగుతున్నాడు. కెరీర్‌లో 49 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్, 36.39 సగటుతో 2657 పరుగులు చేసిన సర్ఫరాజ్ అహ్మద్, 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు..


116 వన్డేలు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్, 33.85 సగటుతో 2302 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 58 టీ20 మ్యాచుల్లో 28 సగటుతో 2302 పరుగులు చేసిన సర్ఫరాజ్ అహ్మద్, మూడు ఫార్మాట్లలో కలిపి వికెట్ కీపర్‌గా 300లకు పైగా క్యాచులు అందుకున్నాడు...

తనకు ఎదురైన అనుభవాల కారణంగా తన కొడుకు అబ్దుల్లాని క్రికెట్‌కి దూరంగా పెంచుతానని, క్రికెటర్ మాత్రం కానివ్వని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకొచ్చాడు సర్ఫరాజ్ అహ్మద్.. 

click me!