Published : Sep 23, 2020, 06:24 PM ISTUpdated : Sep 23, 2020, 11:41 PM IST

KKR vs MI IPL 2020 Match Live Updates: చిత్తుగా ఓడిన కోల్‌కత్తా... ముంబై ఘనవిజయం...

సారాంశం

MI vs KKR: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడనుంది. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 25 సార్లు తలబడగా ముంబై 19 సార్లు విజయం సాధించింది. కోల్‌కత్తాకి కేవలం ఆరు మ్యాచుల్లోనే విజయం దక్కింది. గత 9 మ్యాచుల్లో 8 మ్యాచుల్లో ముంబైదే విజయం. చెన్నైపై పరాజయంతో ఢీలా పడిన ముంబై, నేటి మ్యాచ్‌లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది. 

KKR vs MI IPL 2020 Match Live Updates: చిత్తుగా ఓడిన కోల్‌కత్తా... ముంబై ఘనవిజయం...

11:45 PM (IST) Sep 23

ఆ ఇద్దరి తర్వాత కమ్మిన్స్...

 

బుమ్రా ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన ప్లేయర్లు ముగ్గురే... వాళ్లు ఎవ్వరంటే... 
JP Duminy Delhi 2015
Dwayne Bravo Mumbai WS 2018
Pat Cummins Abu Dhabi 2020 *

11:44 PM (IST) Sep 23

ముంబై రికార్డు విజయం...

Most wins against an opponent in IPL
20 MI vs KKR *
17 KKR vs KXIP
17 MI vs CSK

16 MI vs RCB

15 CSK vs DC

15 CSK vs RCB

11:43 PM (IST) Sep 23

ఏడేళ్ల తర్వాత ‘తొలి’ పరాజయం...

2013 నుంచి ఏడేళ్లుగా టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ గెలుస్తూ వస్తున్న కోల్‌కత్తా... 2020లో మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడి, రికార్డుకి బ్రేక్ వేసింది.

11:41 PM (IST) Sep 23

వారి కంటే కమ్మిన్స్ బెటర్...

Narine + Russell + Morgan = 36 runs off 41 balls, 2 sixes
Cummins - 33 runs, 12 balls, 4 sixes

11:40 PM (IST) Sep 23

ఆఖరి బంతికి వికెట్..

ఆఖరి బంతికి వికెట్ పడడంతో కోల్‌కత్తా 49 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

11:38 PM (IST) Sep 23

ఆఖరి బంతికి 50..

ఆఖరి బంతికి 50 పరుగులు కావాలి.

11:38 PM (IST) Sep 23

2 బంతుల్లో 52...

కోల్‌కత్తా విజయానికి 2 బంతుల్లో 52 పరుగులు కావాలి.

11:37 PM (IST) Sep 23

5 బంతుల్లో 54...

కోల్‌కత్తా పరాజయం ఖరారైంది. చివరి 5 బంతుల్లో 54 పరుగులు కావాలి.

11:32 PM (IST) Sep 23

బుమ్రా ఓవర్‌లో 27 పరుగులు...

మొదటి 3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రాను ఓ ఆటాడేసుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్. నాలుగు సిక్సర్లతో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు.

11:31 PM (IST) Sep 23

ప్యాట్ కమ్మిన్స్ 4 సిక్సర్లు...

బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదాడు ప్యాట్ కమ్మిన్స్...

11:30 PM (IST) Sep 23

కమ్మిన్స్ మూడో సిక్సర్...

ప్యాట్ కమ్మిన్స్, బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు.

11:28 PM (IST) Sep 23

ప్యాట్ కమ్మిన్స్ సిక్సర్లు...

రూ. 15 కోట్ల ఆటగాడు ప్యాట్ కమ్మిన్ బుమ్రా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

11:23 PM (IST) Sep 23

ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

నాయక్ అవుట్... 103 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

11:20 PM (IST) Sep 23

మోర్గాన్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

మోర్గాన్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

11:14 PM (IST) Sep 23

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... 11 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటైన రస్సెల్. 

11:11 PM (IST) Sep 23

రస్సెల్ షో మొదలైందా...

15వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు ఆండ్రూ రస్సెల్. 14.5 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని అందుకుంది కోల్‌కత్తా. 

11:07 PM (IST) Sep 23

6 ఓవర్లలో 106 పరుగులు...

కోల్‌కత్తా విజయానికి చివరి 36 బంతుల్లో 106 పరుగులు కావాలి. 

11:06 PM (IST) Sep 23

ఎట్టకేలకు ఓ సిక్సర్...

దినేశ్ కార్తీక్ అవుటైన తర్వాత ఎట్టకేలకు ఇయార్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 14 ఓవర్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 

11:01 PM (IST) Sep 23

వికెట్లకి తగిలినా పడని బెయిల్...

బుమ్రా బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ ఆడిన బంతి... వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ కదలకపోవడంతో మోర్గాన్ బతికిపోయాడు.

10:59 PM (IST) Sep 23

ముంబై టైట్ బౌలింగ్...

కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వని ముంబై బౌలర్లు... ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్ వంటి భీకర బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు కోల్‌కత్తా కష్టపడుతోంది. 

10:53 PM (IST) Sep 23

నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... రాణా అవుట్...

నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... రాణా అవుట్... 24 పరుగులు చేసి అవుటైన నితీశ్ రాణా. బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌తో రాణాను అవుట్ చేసిన హార్ధిక్ పాండ్యా. 

10:50 PM (IST) Sep 23

రాహుల్ చాహార్ అద్భుతమైన ఓవర్...

సెటిలైన దినేశ్ కార్తీక్ అవుట్ చేసిన రాహుల్ చాహార్, ఆ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా 11 ఓవర్లలో 72 పరుగులే చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 

10:46 PM (IST) Sep 23

మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... దినేశ్ కార్తీక్ అవుట్...

మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... దినేశ్ కార్తీక్ అవుట్... 23 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్.

10:44 PM (IST) Sep 23

10 ఓవర్లలో 71 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. విజయానికి చివరి 10 ఓవర్లలో 125 పరుగులు కావాలి.

10:36 PM (IST) Sep 23

9 ఓవర్లలో 64 పరుగులు...

196 పరుగుల లక్ష్యచేధనలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 9 ఓవర్లలో 64 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 27, రాణా 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

10:31 PM (IST) Sep 23

కార్తీక్ అద్భుతమైన రికార్డు...

2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్‌కి ఇది 183వ మ్యాచ్. 13 సీజన్లలో ఆరు జట్ల తరుపున ఆడిన దినేశ్ కార్తీక్, కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు. మే 13, 2008న కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ తుది జట్టులో ఎంపిక కాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తన జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ కార్తీక్ పాల్గొన్నాడు.

10:27 PM (IST) Sep 23

7 ఓవర్లలో 41 పరుగులు...

7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది కోల్‌కత్తా. క్రీజులో దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా ఉన్నారు.

10:24 PM (IST) Sep 23

6.2 ఓవర్లలో 38 పరుగులు...

196 పరుగుల లక్ష్యచేధనలో కోల్‌కత్తా నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. 6,2 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే సాధించింది.

10:21 PM (IST) Sep 23

నితీశ్ రాణా సిక్సర్...

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో నితీశ్ రాణా భారీ సిక్సర్ బాదాడు. 

10:19 PM (IST) Sep 23

డి కాక్ అద్భుతమైన క్యాచ్

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా గాల్లోకి ఎగురుతూ అందుకున్నాడు ముంబై కీపర్ డి కాక్..

 

 

10:16 PM (IST) Sep 23

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... నరైన్ అవుట్...

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... నరైన్ అవుట్... 9 పరుగులకే పెవిలియన్ చేరిన సునీల్ నరైన్, 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా...

10:13 PM (IST) Sep 23

కార్తీక్ దూకుడు...

దినేశ్ కార్తీక్ 6 బంతులు ఆడి రెండు ఫోర్లు బాదాడు. 

10:12 PM (IST) Sep 23

నాలుగు ఓవర్లలో 19 పరుగులే...

భారీ లక్ష్యచేధనలో కోల్‌కత్తా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది. మొదటి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే వచ్చాయి.

10:09 PM (IST) Sep 23

ఐదేళ్ల తర్వాత టాప్‌లో దినేశ్ కార్తీక్...

2015 తర్వాత దినేశ్ కార్తీక్ టాప్ 3లో బ్యాటింగ్‌కి రావడం ఇదే మొదటిసారి. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా 26 ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్ 715 పరుగులు చేశాడు. 

10:07 PM (IST) Sep 23

బుమ్రా చేతికి బంతి...

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసేందుకు బుమ్రా బంతి అందుకున్నాడు. 

10:05 PM (IST) Sep 23

ఒకే ఒక్కసారి...

190+ స్కోరు చేసిన మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్కసారి ఓడిపోయింది ముంబై ఇండియన్స్...

10:03 PM (IST) Sep 23

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... శుబ్‌మన్ అవుట్...

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... శుబ్‌మన్ అవుట్... 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా. 7 పరుగులకే శుబ్‌మన్ గిల్.

09:59 PM (IST) Sep 23

నరైన్ సిక్సర్...

సునీల్ నరైన్ భారీ సిక్సర్ బాదాడు. 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 8 పరుగులు చేసింది కోల్‌కత్తా.

09:58 PM (IST) Sep 23

తొమ్మిది బంతుల తర్వాత తొలి పరుగు...

కోల్‌కత్తా 9 బంతుల తర్వాత తొలి పరుగు సాధించింది. 

09:54 PM (IST) Sep 23

మొదటి ఓవర్‌ మెయిడిన్...

భారీ లక్ష్యచేధనలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చాలా నెమ్మదిగా మొదలెట్టింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాలేదు.