
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పరాజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్యంతో ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి, ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 4 వికెట్లు తీస్తే సరిపోతుంది..
ఓవర్‌నైట్ స్కోర్ 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, 177 పరుగుల వద్ద బెన్ డక్లెట్ వికెట్ కోల్పోయింది.112 బంతుల్లో 9 ఫోర్లతో 83 పరుగులు చేసిన బెన్ డక్లెట్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కి బెన్ స్టోక్స్, డక్లెట్ కలిసి జోడించిన 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత 22 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, అసాధారణ రీతిలో రనౌట్ అయ్యాడు..
కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 52వ ఓవర్‌లో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో, నిర్లక్ష్యంగా క్రీజు వదిలి ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లకు త్రో వేసి, రనౌట్‌కి అప్పీల్ చేశాడు..
అసలు ఏం జరిగిందో అర్థం కానీ జానీ బెయిర్‌స్టో, తెల్ల మొహం వేశాడు. జానీ బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్ ఇచ్చి... క్రీజు దాటి ఉంటే అది డెడ్‌బాల్‌గా మారి ఉండేది. జానీ బెయిర్‌స్టో, ఏదో ఆలోచించి నిర్లక్ష్యంగా క్రీజు దాటడాన్ని గమనించిన థర్డ్ అంపైర్, అతన్ని రనౌట్‌గా ప్రకటించారు...
బంతి, వికెట్లను దాటి వెనక్కి వెళ్లిన తర్వాత జానీ బెయిర్‌స్టో కనీసం వికెట్ కీపర్ దాన్ని పట్టుకున్నాడా? లేదా? అనే విషయాన్ని వెనక్కి తిరిగి చూసి గమనించలేదు. ఇలా చేసి ఉంటే ఆస్ట్రేలియాకి ఇలా ఓ ఈజీ వికెట్ దక్కి ఉండేది కాదు. అయితే ఇంగ్లాండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు..
ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం కరెక్ట్ కాదని ఆసీస్ టీమ్‌పై ఫైర్ అవుతున్నారు. మరికొందరు కీలక మ్యాచ్‌లో అది కూడా టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం బంతి ఎక్కడుందనే విషయాన్ని కూడా గమనించకుండా లేజీగా వ్యవహరించిన జానీ బెయిర్‌స్టోని ట్రోల్ చేస్తున్నారు..
193 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. దీంతో ఇంగ్లాండ్‌ని కాపాడే బాధ్యతను మరోసారి తన భుజాన వేసుకున్న కెప్టెన్ బెన్ స్టోక్స్, దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 54వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన బెన్ స్టోక్స్, 56వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు.
స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఏడో వికెట్‌కి 31 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు బెన్ స్టోక్స్. ఇందులో స్టువర్ట్ బ్రాడ్ చేసింది కేవలం ఒక్క పరుగే. 147 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌తో పాటు స్టువర్ట్ బ్రాడ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు.