IPL2022 SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండు మార్పులతో కేకేఆర్...

Published : Apr 15, 2022, 07:05 PM ISTUpdated : Apr 15, 2022, 07:15 PM IST
IPL2022 SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండు మార్పులతో కేకేఆర్...

సారాంశం

ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... కేకేఆర్ తరుపున ఆరోన్ ఫించ్ ఆరంగ్రేటం...

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

5 మ్యాచుల్లో మూడింట్లో గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడింది కేకేఆర్. శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా తప్ప మిగిలిన ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు...

వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఓపెనర్ అజింకా రహానే, తన స్థానాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో మెరుపులు తప్ప ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్న సీనియర్ ఓపెనర్ అజింకా రహానే స్థానంలో ఆరోన్ ఫించ్‌కి అవకాశం కల్పించింది కేకేఆర్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆరోన్ ఫించ్, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఆలెక్స్ హేల్స్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఆరోన్ ఫించ్‌కి కేకేఆర్ 9వ ఐపీఎల్ ఫ్రాంచైజీ. ఇంతకుముందు గుజరాత్ లయన్స్, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, డఇల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకి ఆడాడు ఆరోన్ ఫించ్. 

అలాగే యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆమన్ ఖాన్‌కి తుది జట్టులో అవకాశం కల్పించింది కేకేఆర్. స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ వికెట్లు తీస్తున్నా బ్యాటింగ్‌లో మెరుపులు చూపించాల్సి ఉంది. 

మొదటి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు విజయాలు అందుకుని జోరు మీద ఉంది... యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ త్రిపాఠి కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అయితే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్ ఇప్పటిదాకా పూర్ పర్ఫామెన్స్‌తో నిరాశపరిచాడు...

వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఇబ్బంది పెట్టొచ్చు. సుందర్ స్థానంలో  జగదీశ సుచిత్‌కి తుది జట్టులో చోటు దక్కింది. కేకేఆర్‌లో ఉమేశ్ యాదవ్, ప్యాట్ కమ్మిన్స్, సన్‌రైజర్స్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ జట్టు: ఆరోన్ పించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రే రస్సెల్, షెల్డన్ జాక్సన్, ప్యాట్ కమ్మిన్స్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, ఆమన్ హకీం ఖాన్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్‌రమ్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?