IPL2022 Auction: క్రికెట్ అభిమానులతో పాటు పది ఫ్రాంచైజీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం రానే వచ్చింది. బెంగళూరు (ఐటీసీ గార్డెన్ హోటల్) వేదికగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ‘నోట్లాట’ మొదలైంది. ఐపీఎల్-15 సీజన్ కోసం జరుతుతున్న ఈ పైసల కొట్లాట లో ఏ ఆటగాడు ఎంత దక్కించుకుంటారనేదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్..

09:34 PM (IST) Feb 12
సాయి కిషోర్‌ని రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది...
09:29 PM (IST) Feb 12
జగదీశ సుచిత్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:26 PM (IST) Feb 12
శ్రేయాస్ గోపాల్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి... సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు శ్రేయాస్ గోపాల్‌ను దక్కించుకుంది.
09:25 PM (IST) Feb 12
కేసీ కరియప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
09:21 PM (IST) Feb 12
మురగన్ అశ్విన్‌ని రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
09:11 PM (IST) Feb 12
ఆవేశ్ ఖాన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...
09:05 PM (IST) Feb 12
అక్ష్‌దీప్ సింగ్‌ను రూ.20 లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.
09:05 PM (IST) Feb 12
కెఎం అసిఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
09:03 PM (IST) Feb 12
కార్తీక్ త్యాగి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. ఎట్టకేలకు సన్‌రైజర్స్ రూ.4 కోట్లకు కార్తీక్ త్యాగిని దక్కించుకుంది...
08:57 PM (IST) Feb 12
బాసిల్ తంపిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
08:55 PM (IST) Feb 12
జితేశ్ శర్మను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది...
08:52 PM (IST) Feb 12
షెల్డన్ జాక్సన్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది...
08:50 PM (IST) Feb 12
ప్రభుసిమ్రాన్ సింగ్‌ను రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
08:47 PM (IST) Feb 12
వికెట్ కీపర్ అనుజ్ రావత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. రూ.3.4 కోట్లకు అనుజ్ రావత్‌ని కొనుగోలు చేసింది ఆర్సీబీ...
08:40 PM (IST) Feb 12
తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.
08:27 PM (IST) Feb 12
షాబాజ్ అహ్మద్‌ని రూ.2.4 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
08:26 PM (IST) Feb 12
కమ్లేశ్ నాగర్‌కోటిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.3.8 కోట్లకు పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.
08:10 PM (IST) Feb 12
ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కోసం ఏకంగా రూ.9 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది గుజరాత్ టైటాన్స్...
07:59 PM (IST) Feb 12
కేకేఆర్ బౌలర్ శివమ్ మావిని తిరిగి రూ.7.25 కోట్లకు సొంతం చేసుకుంది ఆ జట్టు...
07:53 PM (IST) Feb 12
భారీ హిట్టర్ షారుక్ ఖాన్‌ని రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...
07:50 PM (IST) Feb 12
కర్ణాటక ప్లేయర్ అభినవ్ మనోహర్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్...
07:48 PM (IST) Feb 12
రియాన్ పరాగ్‌ను రూ.3.8 కోట్లకు తిరిగి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్...
07:47 PM (IST) Feb 12
అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ డేవాల్డ్ బ్రేవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్...
07:44 PM (IST) Feb 12
అభిషేక్ శర్మను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
07:41 PM (IST) Feb 12
రాహుల్ త్రిపాఠిని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
06:39 PM (IST) Feb 12
ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ జడ్రాన్, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, భారత స్పిన్నర్ అమిత్ మిశ్రాలను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...
06:38 PM (IST) Feb 12
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది...
06:33 PM (IST) Feb 12
భారత స్పిన్నర్ రాహుల్ చాహార్‌ని రూ. 5.25 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్...
06:21 PM (IST) Feb 12
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కుల్దీప్ యాదవ్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
06:15 PM (IST) Feb 12
బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
06:12 PM (IST) Feb 12
టీమిండియా అభిమానులు ‘లార్డ్’గా పిలుచుకునే శార్దూల్ ఠాకూర్ ఈసారి దేశ రాజధాని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కరుణ చూపనున్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడైన శార్దూల్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 2021 వేలంలో అతడి ధర రూ. 2.60 కోట్లుగా ఉంది. కానీ ఈసారి మాత్రం అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి అతడిని రూ. 10.75 కోట్లు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఠాకూర్ ను దక్కించుకోవడానికి పంజాబ్, ఢిల్లీ నువ్వా నేవా అన్నట్టుగా పోటీ పడ్డాయి.
06:03 PM (IST) Feb 12
టీమిండియా పేసర్ భువనేశ్వర్ ను తీసుకోవడానికి ముందు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా ముంబై పోటీలోకి వచ్చి వేలం పాడగానే.. రాజస్థాన్, లక్నో, హైదరాబాద్ కూడా పోటీకి వచ్చాయి. అయితే చివరికి రూ. 4.20 కోట్లతో తిరిగి హైదరాబాద్ ఫ్రాంచైజీనే దక్కించుకుంది. గత సీజన్ లో భువీని రూ. 8.50 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసుకున్న విషయం తెలిసిందే.
05:59 PM (IST) Feb 12
ఇంగ్లాండ్ యువ పేసర్ మార్క్ వుడ్ ను రూ.7.50 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. మార్క్ వుడ్ కు ఇదే ఫస్ట్ ఐపీఎల్. వుడ్ కోసం ఢిల్లీ, లక్నో, ముంబై పోటీ పడ్డాయి.
05:54 PM (IST) Feb 12
ఆస్ట్రేలియా పేసర్ జాస్ హెజిల్వుడ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గతేడాది చెన్నై తరఫున ఆడిన హెజిల్వుడ్ ధర రూ. 2 కోట్లు.. ఈ వేలంలో కూడా అతడి కనీస ధర అంతే ఉంది. కాగా.. వేలంలో ఈ పేసర్ ను దక్కించుకోవడానికి ఢిల్లీ, చెన్నై పోటీ పడ్డాయి. అతడి ధర రూ. 6 కోట్లు దాటగానే ముంబై కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరికి అతడిని రూ.7.75 కోట్లతో బెంగళూరు దక్కించుకుంది.
05:48 PM (IST) Feb 12
న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 10 కోట్లతో దక్కించుకుంది. ఫెర్గూసన్ కోసం గుజరాత్ తో పాటు ఆర్సీబీ కూడా పోటీ పడ్డాయి. కానీ చివరికి అతడిని గుజరాత్ దక్కించుకుంది.
05:42 PM (IST) Feb 12
టీమిండియా నయా బౌలింగ్ సంచలనం ప్రసిద్ధ్ కృష్ణ కు వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కింది. ఇటీవలే వెస్టిండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ లో మెరుగ్గా రాణించడం అతడికి కలిసొచ్చింది. ఈ సిరీస్ లో అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా ఎంపికయ్యాడు. దీంతో ఈ వేలంలో అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరికి ఈ యువ పేసర్ ను రూ. 10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్ లో ప్రసిద్ధ్ ను కోల్కతా రూ. 20 లక్షలకే కొనుగోలు చేసింది.
05:32 PM (IST) Feb 12
టీమిండియా నయా సంచలనం, గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన దీపక్ చాహర్ ఈ వేలంలో హాట్ కేకయ్యాడు. అతడిని దక్కించుకోవడానికి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు చాహర్. దీంతో ఆల్ రౌండర్ కోటాలో అతడిని దక్కించుకోవడానికి రెండు ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టుగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి అతడిని రూ. 14 కోట్లకు సీఎస్కేనే కొనుగోలు చేసింది. 2021 సీజన్ లో చాహర్ ధర రూ. 80 లక్షలు మాత్రమే.. ఈ సీజన్ లో అతడి కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. గతంతో పోలిస్తే చాహర్ ఇప్పుడు 13 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముడయ్యాడు.
05:22 PM (IST) Feb 12
గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన నటరాజన్ మళ్లీ అదే జట్టు తరఫున ఆడనున్నాడు. నట్టూ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరికి అతడిని హైదరాబాద్ ఫ్రాంచైజీయే రూ. 4 కోట్లకు దక్కించుకుంది.
05:02 PM (IST) Feb 12
వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ను దక్కించుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. ముందు అతడిని దక్కించుకోవడానికి అంతగా ఆసక్తి చూపని కేకేఆర్.. వేలంలో అతడి ధర రూ. 5 కోట్లు దాటగానే పూరన్ కోసం పోటీ పడింది. పూరన్ కోసం ముందు పోటాపోటీగా బిడ్ వేసిన చెన్నై..కేకేఆర్ వచ్చాక తప్పుకుంది. చివరికి అతడిని రూ. 10.75 కోట్లు వెచ్చించి హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 2021 సీజన్ లో పూరన్ ను రూ. 4.20 కోట్లతో పంజాబ్ కొనుక్కుంది.
04:51 PM (IST) Feb 12
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ను తీసుకోవడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అతడి కనీస ధర రూ. 1 కోటి కి కూడా అమ్ముడుపోలేదు. ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.