Published : Mar 22, 2025, 05:57 PM ISTUpdated : Mar 22, 2025, 10:53 PM IST

IPL KKR vs RCB LIVE : ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైవ్

సారాంశం

IPL 2025 KKR vs RCB LIVE : ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

IPL KKR vs RCB LIVE : ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైవ్

10:53 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: దంచికొట్టిన కోహ్లీ.. కేకేఆర్ పై ఆర్సీబీ సూపర్ విక్టరీ

IPL 2025 KKR vs RCB live updates:  ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో తిరుగులేని ప్రదర్శన చేసిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో 177/3  పరుగులతో టార్గెట్ ను అందుకుంది. 

కోహ్లీ 59* పరుగులు

ఫిల్ సాల్ట్ 56 పరుగలు

రజత్ పాటిదార్ 34 పరుగులు

కేకేఆర్ 174-8 (20 ఓవర్లు)

ఆర్సీబీ 177/3 (20 ఓవర్లు)

10:39 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: 56వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ

IPL 2025 KKR vs RCB live updates: ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ లో 56వ హాఫ్ సెంచరీ కొట్టాడు. 

10:14 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates:  తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

IPL 2025 KKR vs RCB live updates:  ఆర్సీబీ తొలి వికెట్ ను కోల్పోయింది. అద్భుతంగా  ఆడుతున్న ఫిల్ సాల్ట్ 56 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో స్పెన్సర్ జాన్సన్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఫిల్ సాల్ట్ తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం పడిక్కల్ 2, కోహ్లీ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆర్సీబీ 98/1 (9.3 ఓవర్లు)

10:10 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates:  కేకేఆర్ ను దంచికొడుతున్న కోహ్లీ, ఫిల్ సాల్ట్

IPL 2025 KKR vs RCB live updates: కేకేఆర్ ఉంచిన 175 ప‌రుగుల టార్గెట్ ను అందుకునేందుకు ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలు కేకేఆర్ ను బౌలింగ్ ను దంచికొడుతున్నారు. ఫిల్ సాల్ట్ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 29 బంతుల్లో 56 ప‌రుగులు చేశాడు. అలాగే, విరాట్ కోహ్లీ 36* ప‌రుగులతో అద్భుతంగా ఆడుతున్నాడు. 

09:21 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: బాల్ తో అదరగొట్టిన కృనాల్ పాండ్యా.. కేకేఆర్ 174-8 పరుగులు (20 ఓవర్లు)

IPL 2025 KKR vs RCB live updates: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జ‌రుగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కొత్త‌ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ర‌హానే కెప్టెన్సీలోని కేకేఆర్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. రహానే 56, సునీల్ నరైన్ 44, అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

కేకేఆర్ 174-8 (20 ఓవర్లు)

09:12 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: య‌ష్ ద‌యాల్ సూప‌ర్ బౌలింగ్.. 19వ ఓవ‌ర్ లో 4 ప‌రుగులు, ఒక వికెట్

IPL 2025 KKR vs RCB live updates: య‌ష్ ద‌యాల్ సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. 19వ ఓవ‌ర్ లో కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. యంగ్ ప్లేయ‌ర్ ర‌ఘువంశీ 30 ప‌రుగుల  వ‌ద్ద అవుట్ అయ్యాడు.  

KKR 169-7 ప‌రుగులు ( 19 ఓవ‌ర్లు)
 

08:55 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates:  రింకూ సింగ్, ఆండ్రీ ర‌స్సెల్ ఔట్

IPL 2025 KKR vs RCB live updates: కృనాల్ పాండ్య బౌలింగ్ లో రింకూ సింగ్ 12 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత సుయాస్ శర్మ బౌలింగ్ లో డెంజ‌ర‌స్ ఆల్ రౌండ‌ర్ ఆండ్రీ ర‌స్సెల్ 4 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. 

KKR 150/6 ( 15.4 ఓవ‌ర్లు)
 

08:41 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: 23 కోట్ల ప్లేయ‌ర్ 6 ప‌రుగుల‌కే ఔట్ !

IPL 2025 KKR vs RCB live updates: ఏకంగా 23.75 కోట్ల‌కు మెగా వేలంలో  కేకేఆర్ ద‌క్కించుకున్న వెంకటేష్ అయ్యర్ కేవ‌లం 6 ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా అద్భుత‌మైన బౌలింగ్ లో అయ్య‌ర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి KKR 131-4 ప‌రుగుల‌తో ఆడుతోంది. 
 

08:30 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: బ్యాక్ టూ బ్యాక్ వికెట్స్.. కేకేఆర్ 3వ వికెట్ డౌన్

IPL 2025 KKR vs RCB live updates: కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న సునీల్ నరైన్ 44(26) పరుగుల వద్ద రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు. 11 ఓవర్ లో కేప్టెన్ అజింక్య రహానే 56 పరుగుల వద్ద మూడో వికెట్ గా అవుట్ అయ్యాడు. కేకేఆర్ 11 ఓవర్లలో 110/3 ప‌రుగుల‌తో ఆడుతోంది. వెంక‌టేష్ అయ్య‌ర్ 1, ర‌ఘువంశీ 1 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 

08:23 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: ఐపీఎల్ 2025లో తొలి హాఫ్ సెంచ‌రీ కొట్టిన అజింక్య ర‌హానే

IPL 2025 KKR vs RCB live updates: KKR కొత్త కెప్టెన్ అజింక్య రహానే  తన KKR కెప్టెన్సీ అరంగేట్రంలో అద‌ర‌గొడుతున్నాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో కేవ‌లం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. లాంగ్-ఆన్ లో మ‌రో అద్భుత‌మైన సిక్స‌ర్ తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 25 బంతుల్లో 51 ప‌రుగుల‌తో ఐపీఎల్ 2025లో తొలి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు కొట్టాడు. 

07:56 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: 5 ఓవర్లు ముగిసే సరికి KKR 40-1

IPL 2025 KKR vs RCB live updates: 5 ఓవర్లు ముగిసే సరికి KKR 40-1 పరుగులు చేసింది. క్రీజులో రహానే 24 పరుగులు, నరైన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 

07:54 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: ఐపీఎల్ 2025లో తొలి సిక్సర్ కొట్టిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే

IPL 2025 KKR vs RCB live updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తొలి సిక్సర్ కొట్టాడు. 4వ ఓవర్ లో రసిఖ్ దార్ సలాం బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ లో రహానే 3, 5వ బంతులను సిక్సర్లుగా మలిచాడు. 

07:39 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

IPL 2025 KKR vs RCB live updates: తొలి ఓవర్ లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్ లో క్వింటన్ డీ కాక్ జితేష్ శర్మకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. కేకేఆర్ తొలి ఓవర్ పూర్తయ్యే సరికి 4-1 పరుగులతో ఆడుతోంది. 

07:35 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: ఇరు జట్ల ప్లేయర్లు వీరే

IPL 2025 KKR vs RCB live updates: ఇరు జట్ల ప్లేయర్లు వీరే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు XI:

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ దార్ సలాం, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్.

కోల్‌కతా నైట్ రైడర్స్ XI:

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

07:23 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు ఏం చెప్పారంటే?

IPL 2025 KKR vs RCB live updates: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ. ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడుతూ.. 

రజత్ పాటిదార్: మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము, పిచ్ కఠినంగా కనిపిస్తోంది. RCBని నడిపించడం అద్భుతంగా ఉంది. గొప్ప ఆటగాళ్ల నుండి నేర్చుకోవడానికి గొప్ప అవకాశం. గత 10-15 రోజులుగా మేము సరైన సన్నాహాలు చేసాము. మేము 4 మంది ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తున్నాము.

అజింక్య రహానే: ఈ జట్టును నడిపించడం గౌరవంగా ఉంది. కోర్ గ్రూప్ అలాగే ఉంది. ముందుగా బాగా బ్యాటింగ్ చేయడానికి, తరువాత డిఫెన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. ఇదంతా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం. వారిని ఒక యూనిట్‌గా ఆడటానికి చూస్తున్నాము.  మేము 3 మంది ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు 2 స్పిన్నర్లతో ఆడుతున్నాము. 

07:17 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

IPL 2025 KKR vs RCB live updates: IPL 2025 సీజన్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో ప్రారంభమైంది. రెండు జట్లకు కొత్త కెప్టెన్లు ఉన్నారు. కేకేఆర్ జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తుండగా, ఆర్‌సీబీ జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

07:11 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: కరణ్ ఔజ్లా సూపర్ షో

IPL 2025 KKR vs RCB live updates: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరమనీలో కరణ్ ఔజ్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. 

 

07:08 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates:  షారుఖ్, రింకూ, కోహ్లీ డాన్స్

IPL 2025 KKR vs RCB live updates: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ఘ‌నంగా ప్రారంభం అయింది. ఓపెనింగ్ షో లో  షారుఖ్ ఖాన్, రింకూ సింగ్, విరాట్ కోహ్లీలు డాన్స్ తో అద‌ర‌గొట్టారు.

 

06:28 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB live updates: ఐపీఎల్ 2025 లైవ్ అప్డేట్స్

IPL 2025 KKR vs RCB live updates: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 అద్భుతమైన ప్రారంభోత్సవం ప్రారంభమైంది. బాలీవుడ్ కింగ్ ఖాన్,  KKR జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులను పలకరించి IPL సీజన్ 18ని ప్రారంభించారు.


 

06:22 PM (IST) Mar 22

IPL 2025 KKR vs RCB: ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు

IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ లో వాతావరణం ప్రశాంతంగా ఉంది.

 

 


More Trending News