Published : Jun 03, 2025, 03:17 PM ISTUpdated : Jun 03, 2025, 11:25 PM IST

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ vs పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైన‌ల్ లైవ్ అప్డేట్స్

సారాంశం

2025 ఐపీఎల్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ ఆస‌క్తిక‌ర పోరుకు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడ‌యం వేదిక అయ్యింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ అప్టేట్స్ ఇక్క‌డ చూడొచ్చు.

11:25 PM (IST) Jun 03

ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ

IPL 2025 Prize money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీతో కొత్త ఛాంపియన్ గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ ఆర్సీబీకి తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.

 

11:15 PM (IST) Jun 03

7వ వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఓమర్జాయ్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 7వ వికెట్ కోల్పోయింది. ఓవర్జాయ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు.

పంజాబ్ కింగ్స్: 146/7 (17.3 ఓవర్లు)

 

11:11 PM (IST) Jun 03

డబుల్ ధమాకా.. 6వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్.. వధేరా, స్టోయినీస్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 6వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 16.2 ఓవర్ల వద్ద నేహల్ వధేరా 15 పరుగుల వద్ద 5వ వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినీస్ సిక్సర్ బాది తర్వాత బంతికి క్యాచ్ గా అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్142 పరుగులతో ఆడుతోంది. భువనేశ్వర్ తన ఓవర్ లో రెండు వికెట్లు తీసుకున్నాడు.

11:02 PM (IST) Jun 03

అదరగొడుతున్న ఆర్సీబీ బౌలర్లు: పంజాబ్ 119/4 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 119-4 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్: 119/4 (15 ఓవర్లు)

శశాంక్ సింగ్ 9(10)

నేహల్ వధేరా 13(14)

10:45 PM (IST) Jun 03

నాల్గో వికెట్ కోల్పోయిన పంజాబ్.. జోష్ ఇంగ్లీస్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ నాల్గో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లీస్ పాండ్య బౌలింగ్ లో క్రీజు లైన్ వద్ద లివింగ్ స్టోన్ కు క్యాచ్ రూపంలో దొరికాడు. 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

పంజాబ్ కింగ్స్: 98/4 (12.3 ఓవర్లు)

 

10:32 PM (IST) Jun 03

బిగ్ వికెట్: శ్రేయాస్ అయ్యర్ అవుట్.. పంజాబ్ 79/3 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. షెఫర్డ్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో జితేష్ శర్మకు చిక్కాడు.

పంజాబ్ కింగ్స్: 79/3 (9.4 ఓవర్లు)

జోష్ ఇంగ్లీస్ 23* పరుగులు

 

10:26 PM (IST) Jun 03

ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్: పంజాబ్ 72/2 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పాండ్యా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

పంజాబ్ కింగ్స్: 72/2 (8.3 ఓవర్లు)

జోష్ ఇంగ్లీస్ 17* పరుగులు

 

10:11 PM (IST) Jun 03

పవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ 52/1 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్: 52/1 (6 ఓవర్లు)

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24* పరుగులు

జోష్ ఇంగ్లీస్ 8* పరుగులు

10:05 PM (IST) Jun 03

ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్: ప్రియాంష్ ఆర్య అవుట్.. పంజాబ్ 43/1 (5 ఓవర్లు) పరుగులు

 

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడి ప్రియాంష్ ఆర్య 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతను బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ గా సాల్ట్ కు దొరికిపోయాడు.

పంజాబ్ కింగ్స్: 43/1 (5 ఓవర్లు)

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 15* పరుగులు

 

 

 

09:49 PM (IST) Jun 03

ఫోర్ తో పంజాబ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ప్రియాంష్ ఆర్య

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ ఉంచిన 191 పరుగులు టార్గెట్ ను అందుకోవడంలో పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించింది. పంజాబ్ ఇన్నింగ్స్ ను ప్రియాంష్ ఆర్య ఫోర్ తో ఆరంభించాడు. 

పంజాబ్ స్కోర్: 23/0 (2)

ప్రియాంష్ ఆర్య 11* పరుగులు 

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 8* పరుగులు   

09:32 PM (IST) Jun 03

పంజాబ్ ముందు 191 పరుగుల టార్గెట్.. ఆర్సీబీ స్కోర్ బోర్డు అప్డేట్

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 191 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

ఆర్సీబీ బ్యాటింగ్:  

విరాట్ కోహ్లీ 43 పరుగులు

పాటిదార్ 26 

అగర్వాల్ 24

లివింగ్ స్టోన్ 25 

జితేష్ శర్మ 24

పంజాబ్ బౌలింగ్:

అర్షదీప్ సింగ్ 3 వికెట్లు 

జేమీసన్ 3 వికెట్లు

 

 

09:25 PM (IST) Jun 03

అర్షదీప్ సూపర్ బౌలింగ్.. చివరి ఓవర్ లో 3 రన్స్ 3 వికెట్లు.. ఆర్సీబీ 190/9 (20 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఫైనల్ ఓవర్ ను అర్షదీప్ సింగ్ అద్భుతంగా వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 20వ ఓవర్ లో తన బౌలింగ్ లో షెఫర్డ్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లను అవుట్ చేశాడు.

ఆర్సీబీ: 190/9 (20 ఓవర్లు)

 

 

09:11 PM (IST) Jun 03

జితేష్ శర్మ అవుట్.. ఆర్సీబీ 171/6 పరుగులు (17.4 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 6వ వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జితేష్ శర్మ వైశాఖ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  జితేష్ 10 బంతుల్లో 24 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

ఆర్సీబీ: 171/6 (17.4 ఓవర్లు)

 

09:06 PM (IST) Jun 03

వరుస సిక్సర్లు బాదిన లివింగ్ స్టోన్ అవుట్.. 167/5 (16.5 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. వరుసగా 3 భారీ సిక్సర్లు వచ్చిన ఈ ఓవర్ లో లివింగ్ స్టోన్ 25 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జేమీసన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

ఆర్సీబీ: 167/5 (16.5 ఓవర్లు)

 

08:50 PM (IST) Jun 03

విరాట్ కోహ్లీ అవుట్.. ఆర్సీబీ 14.5 ఓవర్లలో 131/4 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 43 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ ఓమర్జాయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు కొట్టాడు.

ఆర్సీబీ: 131/4 (14.5 ఓవర్లు)

లివింగ్ స్టోన్ : 16* పరుగులు 

08:30 PM (IST) Jun 03

100 పరుగులు పూర్తి చేసిన ఆర్సీబీ

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 11.3 ఓవర్లలో 100 పరుగుల పూర్తి చేసింది.

ఆర్సీబీ: 103/3 (12 ఓవర్లు)

కోహ్లీ 32* పరుగులు

లివింగ్ స్టోన్ 3*  పరుగులు 

08:28 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కెప్టెన్ రజత్ పాటిదార్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 26 పరుగుల వద్ద జేమీసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆర్సీబీ  96/3 (10.5 ఓవర్లు)

 

08:24 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 88/2

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో 10 ఓవర్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 87/2 (10)

రజత్ పాటిదార్ 18(12)

విరాట్ కోహ్లీ 27(21

 

08:06 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. మయాంక్ అగర్వాల్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పవర్ ప్లే ముగిసిన తర్వాతి బంతికే ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది.

మయాంక్ అగర్వాల్ 24 (18) అవుట్ అయ్యాడు. చాహల్ తన తొలి ఓవర్ రెండో బంతికి మయాంక్ ను అవుట్ చేశాడు. 

ఆర్సీబీ స్కోర్: 56/2 ( 6.2 ఓవర్లు)

 

08:01 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: పవ‌ర్ ప్లే త‌ర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1 (6 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.

ఆర్సీబీ స్కోర్: 55/1 (6 ఓవర్లు)

విరాట్ కోహ్లీ 13 (10)

మయాంక్ అగర్వాల్ 24 (17)

 

07:42 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. ఫిల్ సాల్ట్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ప్రారంభించారు. 1.4 ఓవర్ల వద్ద ఫిల్ సాల్ట్ 16 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జేమిసన్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ రూపంలో సాల్ట్ దొరికిపోయాడు. 

 

07:31 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: ఇరు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్స్ వీరే

IPL 2025 Final RCB vs PBKS Live: ఇరు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్స్ 

RCB ఇంపాక్ట్ సబ్‌లు: రసిఖ్ సలాం, మనోజ్ భండగే, టిమ్ సెఫర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ

PBKS ఇంపాక్ట్ సబ్‌లు: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జెవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్

 

Read Full Story

07:12 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: ఇరు జట్ల ప్లేయింగ్ XI

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయింగ్ XI:

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెఫర్డ్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్ వుడ్.

పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేయింగ్ XI:

ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమిసన్, విజయ్ కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

07:02 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: టాస్ గెలిచిన పంజాబ్

IPL 2025 Final RCB vs PBKS Live: టాాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది. 

07:01 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: శంకర్ మహదేవన్ పాటలతో హోరెత్తిన నరేంద్ర మోడీ స్టేడియం

IPL 2025 Final RCB vs PBKS Live: ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాటలతో నరేంద్ర మోడీ స్టేడియం హోరెత్తింది.  ఆయన "భారత్ మాతా కీ! అనగానే స్టేడియంలో ఉన్న జనం కూడా భారత్ మాతాకీ జై! అంటూ నినదించారు.

 

 

 

06:46 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: మన భారత సాయుధ దళాలకు నివాళి

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ వేడుకల్లో భారత భారత సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. 

 

 

06:42 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live: ఘనంగా ఐపీఎల్ 2025 ఫైనల్ వేడుకలు

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బడా సింగర్లు తమ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు.

 

 

06:28 PM (IST) Jun 03

IPL 2025 Final: పంజాబ్‌ను ఢీకొట్టే బెంగళూరు జట్టు ఇదే

IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఆర్సీబీ vs పీబీకేఎస్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయింగ్ 11లో ఎవరెవరుంటారు? 

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full Story

05:16 PM (IST) Jun 03

మ్యాచ్ వీక్షించేందుకు వ‌చ్చిన గేల్

ఐపీఎల్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ ల‌వ‌ర్స్ న‌రేంద్ర మోదీ స్టేడియం చేరుకుంటున్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులతో పాటు సెల‌బ్రిటీలు సైతం వ‌స్తున్నారు. భారత్ నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఫ్యాన్స్, సెలబ్రిటీలు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా స్టేడియానికి చేరుకున్నారు.

 

 

 

04:56 PM (IST) Jun 03

ఢీ అంటే ఢీ

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్, బెంగళూరు మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి. రెండూ 18 మ్యాచ్‌ల్లో గెలిచాయి. దీంతో ఈ రెండు జట్ల మ‌ధ్య ఢీ అంటే ఢీ అనేలా మ్యాచ్ సాగ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సీజన్‌లో క్వాలిఫైయర్-1లో కూడా రెండూ తలపడ్డాయి. అప్పుడు బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో ఈ రెండింటి మధ్య ఇది ​​నాల్గవ మ్యాచ్ అవుతుంది. బెంగళూరు 2 మ్యాచ్‌లలో, పంజాబ్ 1 మ్యాచ్‌లో గెలిచింది.

04:25 PM (IST) Jun 03

రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి ఫైనల్

ఐపీఎల్ హిస్టరీలో బెంగళూరు నాలుగోసారి, పంజాబ్ రెండోసారి ఫైనల్‌కు చేరాయి. అయితే, ఇది రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి ఫైనల్ అవుతుంది. RCB 2009, 2011, 2016లలో ఫైనల్స్‌లో ఓడిపోగా, PBKS 2014లో జరిగిన ఏకైక ఫైనల్‌లో ఓడిపోయింది.

 

03:45 PM (IST) Jun 03

బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఎగ‌బ‌డుతోన్న హైద‌రాబాదీలు

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌ను వంద‌లాది మ‌ధ్య, సినిమా థియేట‌ర్‌లో చూస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవ‌డానికి థ్రిల్లింగ్‌గా ఉంది క‌దూ! అయితే హైద‌రాబాద్‌లో కొన్ని థియేట‌ర్ల‌లో ఈ స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. కొన్ని థియేట‌ర్ల‌లో లైవ్ టెలికాస్ట్ అవుతుండ‌గా, వీటికి సంబంధించి 99 శాతం టికెట్స్ బుక్ అయ్యాయి.

పీవీఆర్ ఎర్ర‌మంజిల్‌, పీవీఆర్ నెక్సస్ మాల్ కూకట్ పల్లి, జీఎస్ఎం మాల్, పంజాగుట్ట నెక్ట్స్ గెలెరియా మాల్, కవాడిగూడ ఐనాక్స్, గచ్చిబౌలి పీవీఆర్, కూకట్ పల్లి వై జంక్షన్ అశోక వన్ మాల్, పీవీఆర్ ప్రిస్టన్ గచ్చిబౌలి, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్, పీవీఆర్ మూసారాం బాగ్, ప్రిజం మాల్ ఐనాక్స్, పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ మల్టీప్లెక్స్‌లో మ్యాచ్ లైవ్ చూసేలా ఏర్పాట్లు చేశారు.

03:37 PM (IST) Jun 03

మ్యాచ్‌లో ఎవ‌రు గెల‌వ‌నున్నారా.? చాట్ జీపీటీ చెప్పిన స‌మాధానం ఏంటంటే?

‘ఈ సీజన్‌లో పంజాబ్‌కింగ్స్‌పై ఆర్సీబీ మునుపటి విజయాలు, క్వాలిఫయర్‌- 1లో నిర్ణయాత్మక గెలుపును పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరుకే కాస్త విజయావకాశాలున్నాయి. అయితే ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఇటీవలి ప్రదర్శన, శ్రేయస్‌ అయ్యర్ ఫామ్‌, కెప్టెన్సీని చూస్తే ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది’ అని ప్ర‌ముఖ ఏఐ చాట్‌ జీపీటీ తెలిపింది.

 

03:28 PM (IST) Jun 03

ఐపీఎల్ ముగింపు వేడుకలు

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరగాల్సి ఉండగా.. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 10 రోజుల పాటు నిలిపివేశారు. దీంతో కోల్‌కతాలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. కాగా మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో ముగింపు వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. 

 

03:19 PM (IST) Jun 03

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవడానికి 5 కారణాలు ఇవే

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ 2025 ఫైనల్‌ను గెలవడానికి విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ఎక్కువ అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

 


More Trending News