IPL 2023 RCB vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... ప్లేఆఫ్స్‌ కోసం బెంగళూరు...

Published : May 21, 2023, 07:52 PM ISTUpdated : May 21, 2023, 07:59 PM IST
IPL 2023 RCB vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... ప్లేఆఫ్స్‌ కోసం బెంగళూరు...

సారాంశం

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... పూర్తి జట్టుతో బరిలో దిగుతున్న టైటాన్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ వేసిన తర్వాత కొద్దిసేపటికి మళ్లీ చినుకులు రావడంతో ఈ మ్యాచ్ సజావుగా పూర్తి అవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యం అయ్యింది. అయితే ఓవర్లు నష్టపోకుండా పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ జరగనుంది. . డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఈ మ్యాచ్ సజావుగా జరిగి, ఫలితం తేలడం ఆర్‌సీబీకి అత్యంత అవసరం.. 

ఇప్పటికే 9 మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్, టేబుల్ టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచినా, ఓడిపోయినా టైటాన్స్ పొజిషన్ ఏ మాత్రం మారదు. మంగళవారం మే 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్..

అయితే 13 మ్యాచుల్లో 7 విజయాలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిస్తేనే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరుకోగలుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా, ఆర్‌సీబీ మ్యాచ్ ఓడిపోయినా ముంబై ఇండియన్స్‌కి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది... 

ఇప్పటికే టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్ చేరుకోవడంతో నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కీ ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తుందని అందరూ ఆశించారు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం పూర్తి బలగంతో ఆఖరి మ్యాచ్ ఆడుతున్నట్టు ప్రకటించాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం నేటి మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలో దిగుతోంది. కర్ణ్ శర్మ స్థానంలో హిమాన్షు శర్మ (ఇంపాక్ట్ రిజర్వు) తుది జట్టులోకి వచ్చాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసిస్ (కెప్టెన్), మైఖేల్ బ్రాస్‌వెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వేర్న్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాక్ 

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), ధసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యష్ దయాల్

PREV
click me!

Recommended Stories

ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది