ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఇవాళ(మంగళవారం) డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ గెలిచిన డిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. లక్ష్య చేధనే మేలని భావించి డిల్లీ కెప్టెన్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

11:02 PM (IST) Oct 27
కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన విజయాన్ని బర్త్ డే గిప్ట్ గా ఇచ్చింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 131 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో వార్నర్ సేన 88 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
10:54 PM (IST) Oct 27
డిల్లీ తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్ లో అశ్విన్ ఔటయ్యాడు.
10:47 PM (IST) Oct 27
భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిసికి ఘోర పరాజయం తప్పేలా లేదు. కాస్త నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్(36 పరుగులు) కూడా ఎనిమిదో వికెట్ రూపంలో వెనుతిరిగాడు. దీంతో డిల్లీ 103 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
10:42 PM (IST) Oct 27
డిల్లీ వికెట్ల పతనం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్ ఆర్డర్ మొత్తం ఔటవడంతో బరిలోకి దిగిన రబడ కూడా పెవిలియన్ బాట పట్టాడు. నటరాజన్ బౌలింగ్ లో అతడి వికెట్ పడటంతో డిల్లీ ఏడో వికెట్ పడింది.
10:25 PM (IST) Oct 27
హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతితో మాయ చేస్తున్నాడు. ఇప్పటికే తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టిన అతడు తన చివరి ఓవర్లో మరో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో డిసి ఆరో వికెట్ కోల్పోయింది.
10:18 PM (IST) Oct 27
భారీ లక్ష్య చేధన కోసం బరిలోకి దిగి తడబడుతున్న డిల్లీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఏదయినా అద్భుతం చేస్తాడని ఆశపెట్టుకున్న డిల్లీ అభిమానులకు నిరాశ తప్పలేదు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి విజయ్ శంకర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో కేవలం78 పరుగులకే డిసి ఐదు వికెట్లు కోల్పోయింది.
09:56 PM (IST) Oct 27
రషీద్ ఖాన్ వేసిన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడటంతో డిసి కేవలం 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ముందు హెట్మెయర్ ఆ తర్వాత అజింక్య రహానే(26 పరుగులు) ఔటయ్యాడు.
09:53 PM (IST) Oct 27
ఆదిలోనే కష్టాల్లోకి జారుకున్న డిల్లీని ఆదుకుంటాడని భావించిన హెట్మెయర్ సైతం ఔటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన మొదటి బంతికే అతడు ఔటయ్యాడు.
09:50 PM (IST) Oct 27
220 పరుగుల భారీ లక్ష్యంచేధనలో ఆదిలోనే తడబడ్డ డిల్లీ జట్టును హెట్మెయర్, రహానే జోడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరు కాస్త దూకుడు పెంచడంతో పవర్ ప్లేలో డిసి హాఫ్ సెంచరీ సాధించింది.
09:35 PM (IST) Oct 27
భారీ పరుగుల లక్ష్య ఛేదనలో డిల్లీ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ ధవన్ డకౌటవగా దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన స్టోయినీస్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో కేవలం 14 పరుగులకే డిసి రెండు వికెట్లు కోల్పోయింది.
09:25 PM (IST) Oct 27
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్ లో వున్న ఓపెనర్ శిఖర్ ధవన్ డకౌటయ్యాడు. దీంతో 1 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది.
09:16 PM (IST) Oct 27
డిల్లీ స్టార్ బౌలర్ రబడను హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ చితకొట్టారు. అతడి బౌలింగ్ లో సన్ రైజర్స్ ఏకంగా 54 పరుగులను పిండుకుంది. ఇన్ని పరుగులు సమర్పించుకున్నా ఒక్క వికెట్ ను కూడా పడగొట్టలేకపోయాడు. మిగతా బౌలర్లలో అశ్విన్ 2 ఓవర్లలో 35, నాట్జె 4 ఓవర్లలో 37, అక్షర్ పటేల్ 4ఓవర్లలో 36, దేశ్ పాండే 3 ఓవర్లలో 35, స్టోయినీస్ 2 ఓవర్లలో 15 పరుగులు సమర్పించుకున్నారు.
09:10 PM (IST) Oct 27
ఈ ఐపిఎల్ సీజన్లోనే గుర్తుండిపోయే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ జట్టు అదరగొట్టింది. బర్త్ డూ బాయ్, హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ 66 పరుగులు, మరో ఓపెనర్ సాహా 87 పరుగులతో అదరగొట్టడంతో పాటు చివర్లో మనీష్ పాండే 44 పరుగులు నాటౌట్ తో అదరగొట్టడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 219 పరుగులు చేసింది. దీంతో డిసి ముందు 220 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
08:51 PM (IST) Oct 27
ఓపెనర్లు వార్నర్, సాహాలు ఔటయినా సన్ రైజర్స్ పరుగుల వరద సాగుతూనే వుంది. ఓపెనర్ల బాటలోనే పాండే కూడా వేగంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో కేవలం 17.3 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు డబుల్ సెంచరీ సాధించింది.
08:40 PM (IST) Oct 27
సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేకులు వేశాడు డిసి బౌలర్ నాట్జ్. అతడి బౌలింగ్ లో సాహా(87 పరుగులు) సెంచరీకి చేరువలె ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది.
08:16 PM (IST) Oct 27
వికెట్ పడ్డా హైదరాబాద్ స్కోరు వేగం తగ్గడం లేదు. కేవలం 27 బంతుల్లో 50 పరుగులు బాదాడు సాహా.
08:14 PM (IST) Oct 27
డిల్లీ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్(66 పరుగులు 34 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో 107 పరుగుల వద్ద డిల్లీకి మొదటి వికెట్ లభించింది.
08:10 PM (IST) Oct 27
ఓపెనర్లు డేవిడ్ వార్నర్, సాహా విధ్వంసకర బ్యాటింగ్ లో కేవలం తొమ్మిది ఓవర్లలోనే సన్ రైజర్స్ జట్టు స్కోరు సెంచరీ మార్కును దాటింది.
07:56 PM (IST) Oct 27
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, భర్త్ డే బాయ్ డేవిడ్ వార్నర్ కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ కు డిసి బౌలర్లు చేతులెత్తేయడం తప్ప ఏం చేయలేకపోతున్నారు.
07:52 PM (IST) Oct 27
ఓపెనర్లు వార్నర్, సాహాలు దూకుడుగా ఆడటంతో కేవలం ఐదు ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 55 పరుగులకు చేరింది.
07:16 PM (IST) Oct 27
సన్ రైజర్స్ టీం: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, మనీష్ పాండే, విజయ్ శంకర్, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, శహజాద్ నదీమ్, నటరాజన్
డిల్లీ టీం: శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మెయర్, స్టోయినీస్, అక్షర్ పాటిల్, అశ్విన్, రబాడ, తుషార్ దేశ్ పాండే, నాట్జే